సూపర్ స్టార్ కృష్ణ మరణానికి బాధపడాల్సిన అవసరం లేదంటూ.. అలాంటి వీడియో షేర్ చేసిన ఆర్జీవీ.. షాకింగ్ కామెంట్స్.!

Published : Nov 15, 2022, 02:41 PM ISTUpdated : Nov 15, 2022, 02:47 PM IST
సూపర్ స్టార్ కృష్ణ మరణానికి బాధపడాల్సిన అవసరం లేదంటూ.. అలాంటి వీడియో షేర్ చేసిన ఆర్జీవీ.. షాకింగ్ కామెంట్స్.!

సారాంశం

నట శేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తుదిశ్వాస వదలడంతో కుటుంబీకులు, అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి విషాద సమయంలో రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కార్డిక్ అరెస్ట్ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్ప్రతితో చేరారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ప్రపంచస్థాయిలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. కృష్ణ  ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఆందోన చెందారు. తిరిగి వస్తాడని ఆశించినా నిరాశే ఎదరైంది. ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు కృష్ణ ఆత్మకు శాంతికి చేకూరాలని సోషల్ మీడియా వేదికన సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

కానీ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కృష్ణ మరణంపై షాకింగ్  కామెంట్స్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్రంగా చింతిస్తున్న తరుణంలో సంచలన ట్వీట్ చేశారు. తనదైన శైలిలో కృష్ణకు నివాళి అర్పించారు. ‘కృష్ణ  ఇకలేరని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పాటికే కృష్ణ, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండి ఉంటారు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను’ అంటూ ట్వీట్ చేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ను జతచేశారు. 

ప్రస్తుతం కృష్ణ పార్థివదేహాన్ని నానక్ రామ్ లోని ఇంటికి తరలిస్తున్నారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కృష్ణ గారి ఇంటివద్దకు  సినీ ప్రముఖులు, స్టార్స్ చేరుకొని కృష్ణ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu)ను పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ వెంట దర్శకుడు త్రివిక్రమ్, థమన్ ఉన్నారు. భరోసాను కల్పిస్తున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?