ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకున్నారు : కృష్ణకు ఆర్.నారాయణ మూర్తి నివాళులు

Siva Kodati |  
Published : Nov 15, 2022, 04:43 PM IST
ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకున్నారు : కృష్ణకు ఆర్.నారాయణ మూర్తి నివాళులు

సారాంశం

ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకున్నారని కృష్ణపై ప్రశంసలు కురిపించారు సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి  . కోట్లాదిమందికి స్పూర్తిని నింపిన వ్యక్తి కృష్ణ అని నారాయణ మూర్తి కొనియాడారు. 

దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి ఒక్కొక్కరిగా చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. తాజాగా సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆర్.నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని ప్రశంసించారు. 

కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. పరిశ్రమలో ఆయన శకం ముగిసిందని... కోట్లాదిమందికి స్పూర్తిని నింపిన వ్యక్తి కృష్ణ అని నారాయణ మూర్తి కొనియాడారు. ఇండస్ట్రీలో తాను ఎవరి కంటే తక్కువ కాదని.. ఎవరికంటే ఎక్కువ కాదనే ఆత్మాభిమానాన్ని కృష్ణ చూపేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకున్న వ్యక్తుల్లో కృష్ణ ఒకరని మూర్తి అన్నారు. ఎంతోమంది నిర్మాతలు, దర్శకులను నిలబెట్టిన వ్యక్తి కృష్ణ అని గుర్తుచేసుకున్నారు. అల్లూరి సీతారామరాజుని అద్భుతంగా తీశారని.. ఎన్టీఆర్ ప్రశంసించారని నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. 

ALso REad:ముగిసిన తొలితరం స్టార్స్ శకం..!

కాగా.. గుండెపోటు రావడంతో హీరో కృష్ణను నిన్న తెల్లవారుజామున కుటుంబసభ్యులు హైద్రాబాద్ కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.గుండెపోటు కారణంగా శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. ఇవాళ ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రి నుండి కృష్ణ పార్థీవదేహన్ని కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?