దుమ్మురేపే మ్యూజిక్ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2 వచ్చేసింది! తమన్ ఆధ్వర్యంలో మోత మోగనుంది!

Published : Feb 14, 2023, 10:30 PM ISTUpdated : Feb 14, 2023, 10:39 PM IST
దుమ్మురేపే మ్యూజిక్ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2 వచ్చేసింది! తమన్ ఆధ్వర్యంలో మోత మోగనుంది!

సారాంశం

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా సరికొత్త షోలతో తన మార్కు చూపిస్తుంది. ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను పరిచయం చేస్తూ నాన్ ఫన్ పంచుతుంది. క్రేజీ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ తిరిగి వచ్చేసింది.   

గత మూడేళ్లుగా ఆహా యాప్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సత్తా చాటుతుంది. అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీ సంస్థలకు పోటీ ఇస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది. సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే రియాలిటీ షోలతో ప్రత్యేకత చాటుకుంటుంది. డాన్స్, మ్యూజిక్ వంటి కళలతో కూడిన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.  బాలయ్య హోస్ట్ గా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్  టాక్ షో వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. సీజన్ వన్ అండ్ టు దుమ్మురేపాయి. స్టార్స్ ని గెస్ట్స్ గా పిలిచి వారి మనోభావాలు, వ్యక్తిత్వాలు ఆవిష్కరించడంలో బాలయ్య సక్సెస్ అయ్యారు. 

కాగా ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. హేమ చంద్ర, శ్రీరామచంద్ర వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోకి థమన్, నిత్యా మీనన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరించారు. 2022 జూన్ లో ఈ తెలుగు ఇండియన్ ఐడల్ ముగిసింది. నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది. 

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో సీజన్ 2 కి శ్రీకారం చుట్టారు. టాలెంటెడ్ సింగర్స్ కంటెస్టెంట్స్ గా షో త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సీజన్ 2 కి సైతం థమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?