ఆఫీషియల్ : OTT లోకి ‘పొలిమేర 2’..ఎప్పటినుంచి అంటే

Published : Dec 02, 2023, 10:32 AM IST
ఆఫీషియల్ : OTT లోకి ‘పొలిమేర 2’..ఎప్పటినుంచి అంటే

సారాంశం

 ‘మా ఊరి పొలిమేర 2’ ఓటీటీ విడుదల తేదీ (Maa Oori Polimera 2 OTT Release Date) తాజాగా ఖరారైంది. 


నవంబరు లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో ‘కీడా కోలా’ తర్వాత కాస్త అందరి దృష్టినీ ఆకర్షించిన మరో చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ (Maa oori polimera 2). ఓటీటీలో విడుదలై అందరి ఆదరణ దక్కించుకున్న ‘మా ఊరి పొలిమేర’కు సీక్వెల్ గా రూపొందింది. మర్డర్‌ మిస్టరీకి బ్లాక్‌ మ్యాజిక్‌ అంశాన్ని జత చేసి అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పడింది. అయితే స్టార్ హీరోలేని చిన్న సినిమా కావటంతో చాలా మంది థియేటర్ కు వెళ్లి చూడలేదు. వాళ్లంతా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యి అఫీషియల్ గా బయిటకు వచ్చింది.

 ‘మా ఊరి పొలిమేర 2’ ఓటీటీ విడుదల తేదీ (Maa Oori Polimera 2 OTT Release Date) తాజాగా ఖరారైంది. డిసెంబరు 8 నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’లో (Maa Oori Polimera 2 on Aha) స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియాలో ఈ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ‘ఆహా గోల్డ్‌’ చందాదారులకు 24 గంటల ముందే సినిమాని చూసే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆ చందాదారులకు డిసెంబరు 7నే సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఫస్ట్ పార్ట్ డైరక్ట్ గా ఓటీటీ (డిస్నీ+హాట్‌స్టార్‌)లో విడుదల చేయగా రెండో భాగాన్ని థియేటర్లలో విడుదల చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. చేతబడి ఇతివృత్తంగా ఈ రెండు సినిమాలను డాక్టర్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించారు. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రలు పోషించి మెప్పిచారు.
 

చిత్రం కథేమిటంటే... జాస్తిపల్లి పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎస్సై రవీంద్ర నాయక్‌ (రాకేందు మౌళి) కొమిరి కేసును తిరిగి ఓపెన్‌ చేస్తాడు. తన అన్నను చేతబడి నెపంతో హత్య చేశారని కేసు వేసిన జంగయ్య ఆఖరి నిమిషంలో కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడు?ఆ తర్వాత నుంచి తనెందుకు కనిపించకుండా పోయాడు? అన్నది ఇన్వెస్టిగేట్‌ చేయడం మొదలు పెడతాడు.  ఈ క్రమంలో అతనికి జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. కొమిరి చేసే క్షుద్రపూజలకూ ఓ లింక్‌ ఉందని కనిపెడతాడు. అలాగే కొమిరి తన స్నేహితుడు బలిజ (గెటప్‌ శ్రీను) భార్యను కేరళ తీసుకెళ్లినట్లు గుర్తిస్తాడు. మరి కొమిరితో వెళ్లిన కవిత ఏమైంది? అతని వెంట బలిజ భార్య వెళ్లడానికి కారణమేంటి? అసలు కొమిరి చేసే క్షుద్రపూజలకు జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న గుడికీ.. అనంత పద్మనాభ స్వామి ఆలయానికీ ఉన్న సంబంధం ఏంటి? కొమిరి చేతబడులు చేసి మనుషుల్ని చంపుతున్నాడని తెలుసుకున్న అతని భార్య లక్ష్మి (కామాక్షి భాస్కర్ల) ఏం చేసింది? తన అన్నను వెతికి పట్టుకునేందుకు వెళ్లిన జంగయ్య ఏమయ్యాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇంట్లో పెద్ద చిచ్చే పెట్టిన వల్లి, ధీరజ్ పై కత్తి ఎత్తిన ప్రేమ
Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం