Allu Arjun: అల్లు అర్జున్ కు అనారోగ్యం, పుష్ప2 షూటింగ్ కు బ్రేక్..? అభిమానుల్లొ ఆందోళన

Published : Dec 02, 2023, 09:14 AM ISTUpdated : Dec 02, 2023, 11:28 AM IST
Allu Arjun: అల్లు అర్జున్ కు అనారోగ్యం, పుష్ప2 షూటింగ్ కు బ్రేక్..? అభిమానుల్లొ ఆందోళన

సారాంశం

జోరుగా సాగుతున్నపుష్ప2మూవీ షూటింగ్ కు సడెన్ గా బ్రేకులు పడ్డాయి. ఓ సాంగ్ షూట్ జరగాల్సి ఉండగా.. అది వాయిదా పడినట్టు తెలుస్తోంది.   

టాలీవుడ్ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప2.  పుష్పకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాతో ఈసారి ఎలాగైనా ఆస్కార్ కు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు.  పుష్ప సినిమాతో పాన్ ఇండియాను ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈసినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో మంది స్టార్స్ పుష్పను ఇమిటేట్ చేస్తూ.. రీల్స్ కూడా చేస్తూ వచ్చారు. ఇక ఈసినిమాతో బన్నీ జాతీయ అవార్డ్ అందుకోవడంతో పాటు..బెస్ట్ మ్యూజిక్ కు దేవిశ్రీ కూడా నేషనల్ అవార్ట్ ను సొంతం చేసుకున్నారు. 

ఈక్రమంలో పుష్ప2పై అంచనాలు మరింతగా పెరిగాయి. బన్నీ ఈసినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అంతే కాదు టీమ్ అంతా ఈమూవీని ఓ యుద్దంలా చేస్తున్నారు. ఈక్రమంలో ఈమూవీ షూటింగ్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈమూవీకి సబంధించిన కీలక సన్నివేశాలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఇక ఓ సాంగ్ ను షూట్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ కాస్త సిక్ అయినట్టు తెలుస్తోంది. 

Ram Charan: గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ నుంచి సాలిడ్ అప్ డేట్..? శంకర్ కు డెడ్ లైన్ పెట్టిన హీరో..?

ఓ ఐటమ్‌ సాంగ్‌ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశారు. అయితే ఆ పాట షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ అయింది.అల్లు అర్జున్‌ అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడమే ఈ పోస్ట్‌పోన్‌కి కారణమని తెలుస్తున్నది. నిజానికి ఈ సినిమాకోసం రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నాడు బన్నీ.  ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలోనూ ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యారట. రిహార్సల్స్‌లో కూడా పాల్గొన్నారట. అయితే ఉన్నట్టుండి ఆయన సిక్‌ అవ్వడంతో షూటింగ్‌ని ఈ నెల రెండోవారానికి మేకర్స్‌ పోస్ట్‌ పోన్‌ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ
Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా