టాలీవుడ్ లో విషాదం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ కె నారంగ్ కన్నుమూత

Published : Apr 19, 2022, 11:10 AM ISTUpdated : Apr 19, 2022, 11:22 AM IST
టాలీవుడ్ లో విషాదం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ కె నారంగ్ కన్నుమూత

సారాంశం

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ఏషియ‌న్ ఫిలింస్ అధినేత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌ నారాయ‌ణ్‌ దాస్ కె.నారంగ్ (78) అనారోగ్యంతో మంగళ వారం కన్నుమూశారు. 

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ఏషియ‌న్ ఫిలింస్ అధినేత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌ నారాయ‌ణ్‌ దాస్ కె.నారంగ్ (78) అనారోగ్యంతో మంగళ వారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్న నిర్మాత నారాయణ్ దాస్ కే నారంగ్ ఈరోజు( 19 ఏప్రిల్) కన్ను మూశారు. కొన్నిరోజులుగా ఓప్రైవేట్  హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న నారాయణ్ దాస్... పరిస్థితి చేయి దాటడంతో తుది స్వాస విడిచారు.  నారాయ‌ణ దాస్ మ‌ర‌ణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, మూవీ ఫైనాన్సియ‌ర్‌గా సినీ రంగానికి సేవ‌లు అందిస్తోన్న ఆయ‌న ప్ర‌స్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గానూ కొన‌సాగుతున్నారు. ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌, ఏషియ‌న్ థియేట‌ర్స్ అధినేతగా ఉన్న నారాయ‌ణ దాస్ కె.నారంగ్ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. అందులో ల‌వ్ స్టోరి, ల‌క్ష్య సినిమాల‌ను నిర్మించారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున‌తో ఘోస్ట్ సినిమాను నిర్మిస్తున్నారు. ధ‌నుష్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నారాయణ. 

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది

దాస్ కే నారంగ్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి మధ్యాహ్నాం 12 గంటలకు హాస్పిటల్ నుంచి నారాయణ్‌ దాస్ నారంగ్ భౌతికకాయం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి తరలిస్తారు. అక్క‌డ‌కు సినీ ప్ర‌ముఖులు చేరుకుని ఆయ‌న పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఆతరువాత అత్యక్రియలకు సంబంధించిన పనులు మొదలు అవుతాయని సమాచారం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నారంగ్ ఇంటికి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం 4గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలియ‌జేశారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే