Bigg Boss Sohail: బిగ్ బాస్ సోహైల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయోగం.. ఫలితం వస్తే ఇద్దరికీ మంచి బ్రేక్!

Published : Apr 19, 2022, 10:21 AM ISTUpdated : Apr 19, 2022, 10:37 AM IST
Bigg Boss Sohail: బిగ్ బాస్ సోహైల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయోగం.. ఫలితం వస్తే ఇద్దరికీ మంచి బ్రేక్!

సారాంశం

సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా ఆయన ఆర్గానిక్ మామ చిత్రం ప్రారంభమైంది.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy)కి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపుంది. చిన్న చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఘనత ఆయన సొంతం. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రం అంటే ఆరోగ్యకరమైన హాస్యం, కట్టిపడేసే భావోద్వేగాలు, వినసొంపైన పాటలు గుర్తుకు వస్తాయి. సగటు భార్యాభర్తల మధ్య జరిగే డ్రామాను ఆయన తెరకెక్కించినంత గొప్పగా మరొకరు చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఎటువంటి వల్గర్ సన్నివేశాలకు తావు లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు ఉంటాయి.

ఓ దశాబ్దం పాటు ఆయన తిరుగులేని దర్శకుడిగా తెలుగు తెరను ఏలారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, మ్యూజిక్, డైరెక్షన్, యాక్టర్, సింగర్... ఇది ఎస్వీ కృష్ణారెడ్డి అత్యధికంగా తన చిత్రాలకు ఇచ్చిన కాంట్రిబ్యూషన్. సినిమా అనే మహా సముద్రంలో ఒక క్రాఫ్ట్ లో ప్రావీణ్యం సాధించడమే కష్టం. అలాంటిది సినిమాకు ఆయువుపట్టైన మ్యూజిక్, కథ, కథనం వంటి విభాగాలను దర్శకత్వంతో పాటు చేసి ఎస్వీ కృష్ణారెడ్డి తానెంతో ప్రత్యేకమని చాటుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఉగాది, శుభలగ్నం, యమలీల, వినోదం వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఉగాది, అభిషేకం చిత్రాల్లో కృష్ణారెడ్డి హీరోగా నటించారు. వీటిలో ఉగాది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

అయితే ఇదంతా గత కాలం నాటి ఘన చరిత్ర. ఆయన క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం యమలీల 2. 2014లో విడుదలైన ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో ఆయన డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన కొత్త చిత్రం ప్రకటించారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు(organic mama hybrid alludu) చిత్రం చేస్తున్నారు. 

టైటిల్ తోనే ఇది పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ కీలక రోల్స్ చేస్తున్నారు. నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పనా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన జోనర్ లో మూవీ చేస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి గ్రేట్ కమ్ ఇవ్వాలని ఆశిద్దాం. మరోవైపు సోహైల్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ఆయన హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే