'కేరాఫ్ కంచరపాలెం' సినిమాకి అవమానం!

Published : Jan 10, 2019, 09:43 AM IST
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాకి అవమానం!

సారాంశం

గతేడాది విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఈ సినిమాని జనాలు బాగా ఆదరించారు.

గతేడాది విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఈ సినిమాని జనాలు బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి జాతీయ అవార్డుల నామినేషన్ విషయంలో నిరాశ ఎదురైంది.

ఈ సినిమాను జాతీయ అవార్డులకు నామినేట్ చేయడాన్ని తిరస్కరిస్తూ నేషనల్ అవార్డ్స్ జ్యూరీ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకి అమెరికా పౌరసత్వం కలిగిన ఓ భారత సంతతి నిర్మాతగా వ్యవహరించడం వలనే తిరస్కరిస్తున్నట్లు జ్యూరీ వెల్లడించింది.

'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను నిర్మించిన ప్రవీణ పరుచూరి వలనే ఇలా జరగడంతో ఆమె చింతిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిత్ర దర్శకుడు వెంకటేష్ మహాకి క్షమాపణ చెబుతూ.. నీ టాలెంట్ కి గుర్తింపు నోచుకోకపోవడానికి కారణం తానేనని ఆమె ట్వీట్ చేయగా దానికి స్పందించిన వెంకటేష్ మహా.. సినిమాను జ్యూరీ రిజక్ట్ చేయడానికి కారణం మీరు కాదని, కాలం చెల్లిన దేశ నియమనిబంధనలని అన్నాడు.

ఒక ఇండియన్ దర్శకుడు తీసిన సినిమా, ఇండియన్స్ నటించిన సినిమా, ఇండియన్ ఆడియన్స్ కోసం తీసిన నేషనల్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వదకపోవడం ఏంటో తనకు అర్ధం కావడం లేదని అన్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్