జెంటిల్మన్,‌ చంద్రముఖి మాటల రచయిత శ్రీ రామకృష్ణ మృతి

By Surya PrakashFirst Published Apr 2, 2024, 7:08 AM IST
Highlights

. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా శ్రీ రామకృష్ణ మాటలు అందించారు. 


ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ తన 74 ఏట కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న రామ కృష్ణ గారిని తేనాపేటలోని అపోలో హాస్పిటల్లో చేర్చగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన తన తుది శ్వాస విడిచారు. ఆయన  మొత్తం 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పనిచేసారు. వాటిల్లో ముంబై, జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

అనువాద రచయితగా పనిచేయడం మాత్రమే కాదు బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు.  మణిరత్నం, శంకర్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసేవారు.  అయితే  శ్రీ రామకృష్ణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా శ్రీ రామకృష్ణ మాటలు అందించారు. శ్రీ రామకృష్ణ మృతి చెందారన్న వార్త విన్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన సొంత ఊరు తెనాలి కాగా 50 సంవత్సరాల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయారు. రామ కృష్ణ గారు ఎం ఏ పట్టాదారులు. ఆయన భార్య పేరు స్వాతి, కుమారుడు గౌతమ్. ఈ రోజు ఉదయం సాలిగ్రామంలో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నట్లు కొడుకు గౌతమ్ తెలిపారు.
 

click me!