నటి శరణ్య పొన్వన్నన్ పై పోలీసుకేసు.. అసలేం జరిగింది..?

Published : Apr 02, 2024, 07:08 AM ISTUpdated : Apr 02, 2024, 09:27 AM IST
 నటి శరణ్య పొన్వన్నన్ పై పోలీసుకేసు.. అసలేం జరిగింది..?

సారాంశం

శరణ్య, ఆమె కుటుంబం తమ ఇంట్లోకి చొరబడి తనను అసభ్య పదజాలంతో దూషించారని, చంపేస్తామని బెదిరించారని శ్రీదేవి ఆరోపించింది. 


తమిళ, తెలుగులలో తెరకెక్కిన చాలా చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యిన నటి శరణ్య పొన్వన్నన్‌ (Saranya Ponvannan). ఆమె తాజాగా ఓ  వివాదంలో చిక్కుకున్నట్లు తమిళ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. పార్కింగ్‌ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో శరణ్యపై ఓ మహిళ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే..  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

చెన్నైలోని విరుగంబాక్కం ద్మావతి నగర్‌లో నివశిస్తోంది  శరణ్య. గత కొన్ని రోజుల నుంచి ఆమె పొరిగింట్లో ఉంటోన్న శ్రీదేవి అనే మహిళతో పార్కింగ్‌ విషయంలో వివాదం మొదలైందని సమాచారం. శరణ్య పొన్వన్నర్ చంపుతానంటూ కూడా ఆమెను బెదిరించారంట.  శ్రీదేవి ఇంటి గేటు దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. కాగా, నిన్న సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య పొన్వన్నన్ కారు ఆమె డోర్ బయట పార్క్ చేసి ఉంది. శ్రీదేవి ఇంటిని తాకేలా శరణ్య కారు ఉందని, ఈ కారణంగానే శరణ్య పొన్వన్నన్ కి శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైంది.ఈ వాగ్వాదం జరగడంతో శరణ్య కుటుంబం శ్రీదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించినట్లు సమాచారం. 

శరణ్య, ఆమె కుటుంబం తమ ఇంట్లోకి చొరబడి తనను అసభ్య పదజాలంతో దూషించారని, చంపేస్తామని బెదిరించారని శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనపై విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన శరణ్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. దీంతో శ్రీదేవి విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో శరణ్య పొన్వణ్ణన్ సహా ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందిస్తూ శరణ్య పొన్వన్నన్ ఫ్యామిలీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. శ్రీదేవి అందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇరువర్గాలను విచారిస్తున్నారు.
 
నటి శరణ్య 1987లో కమల్ హాసన్ నటించిన నాయగన్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.  ‘రఘువరన్‌ బీటెక్‌’, ‘24’, ‘వేదం’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘మహాసముద్రం’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు