మళ్లీ విజయ్ పై ట్రోలింగ్, బ్లాక్ చేస్తే అంటూ దొరికిపోయాడేంటి?

Published : Apr 02, 2024, 07:07 AM ISTUpdated : Apr 02, 2024, 09:24 AM IST
మళ్లీ విజయ్ పై ట్రోలింగ్, బ్లాక్ చేస్తే అంటూ దొరికిపోయాడేంటి?

సారాంశం

మీరు సినిమాలు చేయబట్టి ఒక తరుణ్ భాస్కర్, రాహుల్ సంకృత్యాన్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు సినీ పరిశ్రమకు దొరికారు. 


సోషల్ మీడియాలో చాలా మంది  ఎప్పుడు ఏ విషయానికి కౌంటర్ ఇస్తూ ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తూంటారు. స్టార్స్ ఇంటర్వూలలో కానీ ట్విట్ లలో కాని చిన్న మాట తేడా అనిపించినా ఓ రేంజిలో ఎక్కేస్తూంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తాజాగా ఇంటర్వూలో చెప్పిన ఓ సమాధానానికి ట్రోలింగ్ షురూ చేసారు. వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతోంది.  మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దానికి తోడు గీత గోవిందం తో ప్రూవ్ చేసుకున్న పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయటం కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా  మీడియాతో మాట్లాడింది సినిమా టీమ్.ఆ క్రమంలో   విజయ్ దేవరకొండ కొద్దిరోజుల క్రితం  తాను కొత్త దర్శకుడితో పని చేయను అని, కనీసం ఒక్క సినిమా తీసిన అనుభవం అయినా ఉండాలని  నిర్మొహమాటంగా  చెప్పేశాడు. ఈ విషయమై మళ్లీ మీడియా ప్రశ్నించింది. 

మీరు సినిమాలు చేయబట్టి ఒక తరుణ్ భాస్కర్, రాహుల్ సంకృత్యాన్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు సినీ పరిశ్రమకు దొరికారు. ఇప్పుడు మీరే కొత్త దర్శకులతో సినిమా చేయను అని అంటే వాళ్ళ అలాంటి దర్శకులు మిస్ అవుతారు కదా అని ప్రశ్నిస్తే దానికి విజయ్ దేవరకొండ  సమాధానం ఇచ్చాడు. అప్పుడు నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్లు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కొత్త డైరెక్టర్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు కొత్త డైరెక్టర్లకి కూడా నేనే అవకాశం ఇస్తే కొత్త నటులకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? 

కొత్త డైరెక్టర్స్ ని కూడా నేనే బ్లాక్ చేస్తే ఇంక కొత్త యాక్టర్స్  తో ఎవరు సినిమాలు చేస్తారు కొత్త నటులతో కొత్త దర్శకులు సినిమా చేస్తే ఇద్దరి పర్ఫామెన్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత నిర్మాతలు వాళ్లతో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది,, నేను చేసిన దర్శకులు అలాగే సూపర్ హిట్లు కొట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా మారుతున్నారు అంటూ సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ. విజయ్ చెప్పిన రిప్లై కొందరికి  లాజికల్ గా అనిపించినా చాలా మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అంటే మిగతా హీరోలు ఎవరూ కొత్త డైరక్టర్స్ ని ఎంకరేజ్ చెయ్యలేదా..కొత్త డైరక్టర్స్ అందరూ నీ వెనకే ఉంటున్నారా...బ్లాక్ వంటి పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావ్..అవసరమా నీకు,నువ్వు చెప్పేది కామెడీ గా ఉంది, నమ్మేలా లేదంటూ అంటూ ట్విట్టర్ లో భారీగా ట్రోలింగ్ మొదలెట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?