Bigg Boss Show Stopped: ఆగిపోయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో... నిరాశలో ప్రేక్షకులు

Published : Mar 03, 2022, 11:50 AM IST
Bigg Boss Show Stopped: ఆగిపోయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో... నిరాశలో ప్రేక్షకులు

సారాంశం

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెట్ అంటూ.. కామా లేదు.. పుల్ స్టాప్ లేదు అంటూ మొదలెట్టిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ఎంటర్ టైన్మెంట్ కు ఆదిలోనే బ్రేక్ పడింది.

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెట్ అంటూ.. కామా లేదు.. పుల్ స్టాప్ లేదు అంటూ మొదలెట్టిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ఎంటర్ టైన్మెంట్ కు ఆదిలోనే బ్రేక్ పడింది.

ప్రతీ ఏడాది ఒక సీజన్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి.. అదిరిపోయే రేటింగ్స్ తో దుమ్మురేపుతుంటుంది బిగ్ బాస్ రియాల్టీ షో. ఇక ఇప్పుడు సరికొత్తగా హంగులతో 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అంటూ.. ఓటీటీలో బిగ్ బాస్ ను ప్రవేశ పెట్టారు టీమ్. కామాలు.. పుల్ స్టాప్ లు ఉండవూ.. 24గంటలూ వినాదో మీ సొంతం అంటూ భారీగా ప్రచారం చేశారు. కాని ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేక్ పడింది.

నాన్ స్టాప్ బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ గా.. ఫిబ్రవరి 26న గ్రాండ్ గా లాంచ్ అయింది. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు ఈ షో ప్రసారంకానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే స్ట్రీమింగ్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని షో స్టాట్ అయినప్పటి నుంచీ ఆడియన్స్ నుంచి కంప్లైయింట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఆడియన్స్ ను ఇంకా నిరాశపరుస్తూ.. బుదవారం అర్ధరాత్రి నుంచి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది.

 ఒక్కసారిగా షో ఆగిపోవడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. షో ఎందుకు ఆగిపోయిందో తెలియక కన్ ఫ్యూజన్ లో పడిపోయారు ఆడియన్స్. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది.ఈ రకంగా టీమ్ ప్రకటనను రిలీజ్ చేసింది.

మరింతగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఇంటిని రెడీ చేస్తున్నాం. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుండి లైవ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఏరోజుకి ఆరోజు పూర్తి ఎపిసోడ్‌ని రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి అంటూ చిన్న  స్క్రోలింగ్ వేశారు. అంటే గురువారం పాత ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్