Maniratnam: మణిరత్నం మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు

Surya Prakash   | Asianet News
Published : Mar 03, 2022, 10:28 AM IST
Maniratnam: మణిరత్నం మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు

సారాంశం

మణిరత్నం.. దేశంలోనే అత్యున్నత దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడ్డాయి.  హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ప్రయాణం సాగుతోంది. తాజాగా ఆయన డైరక్ట్ చేసిన చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించటంతో ..సోషల్ మీడియాలో ఆయన హాట్ టాపిక్ అయ్యారు.  

దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా భారత చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన అరుదైన,విలక్షణ దర్శకుడు.. మణిరత్నం. సౌత్ నుంచి వచ్చిన మణిరత్నం.. ముందుగా కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మౌనరాగం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ప్రయాణం సాగుతోంది. తాజాగా ఆయన డైరక్ట్ చేసిన చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించటంతో ..సోషల్ మీడియాలో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. పలు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

ఈ రిలీజ్ డేట్ తో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. యుద్ధ వీరులుగా జయం రవి, విక్రమ్ కనిపించగా కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక త్రిష, ఐశ్వర్య రాయ్ యువరాణులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారింది. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాతో మణిరత్నం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?