
ఊరుని దత్తత తీసుకోవడం విన్నాం. చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం విన్నాం. అనాథలను దత్తత తీసుకోవడం వినాం. పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడం కూడా విన్నాం. కానీ ఓ పక్షిని దత్తత తీసుకోవడం విన్నారా? అది కూడా గుడ్లగూబని దత్తత తీసుకోవడం దత్తత తీసుకోవడం ఎక్కడైన చూశారా? ఇలాంటి విచిత్రమైన, ఆసక్తికర సంఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అది కూడా గుడ్లగూబని ఓ నటుడు దత్తత తీసుకోవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...
నటుడు, నిర్మాత సూర్యతేజ్ ( Surya Tej) శుక్రవారం గూడ్ల గూబని దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కు(Zoo Park)ని ఆయన సందర్శించారు. అనంతరం జూపార్క్ లోని గూడ్ల గూబని ఏడాది పాటు దత్త తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన రూ.20వేల చెక్కుని జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్‌కి అందించారు. ఈ ఏడాది పాటు ఆ గుడ్లగూబకి సంబంధించి ఆహారం, సంరక్షణకు ఈ మొత్తాన్ని వెచ్చించబోతున్నారు.
ఈ సందర్భంగా సూర్యతేజ్ మాట్లాడుతూ, నెహ్రూ జులాజికల్ పార్క్ ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో మరుపురాని విషయాల్లో ఇది కూడా ఒకటని వెల్డడించారు. హైదరాబాద్ సీటీ ఎన్నో మూగ జీవాలకు నిలయంగా ఉందని, నెహ్రూ జులాజికల్ పార్క్ నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. జంతువులు, పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యతమ మనందరిపై ఉందని వెల్లడించారు. తనవంతుగా ఇలాంటి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు.
అనంతరం జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ మాట్లాడుతూ, సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపినిచ్చాడు. మూగ జీవాల సంరక్షణలో భాగంగా సూర్యతేజ్ తీసుకున్న నిర్ణయం మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆయన్ని చూసి అయినా మరికొంత మంది హీరోలు, ప్రజలు ఇలా జంతువులను దత్తత తీసుకునేందుకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. నటుడు సూర్యతేజ్ పలు సినిమాలు, అలాగే సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ప్రామిసింగ్ యాక్టర్‌గా నిలిచారు.
also read: ఎన్టీఆర్ నాతో ఆ మాట అన్నారు.. పునీత్ మరణం తర్వాత తొలిసారి శివరాజ్ కుమార్..