ఎన్టీఆర్ నాతో ఆ మాట అన్నారు.. పునీత్ మరణం తర్వాత తొలిసారి శివరాజ్ కుమార్..

pratap reddy   | Asianet News
Published : Nov 12, 2021, 05:04 PM IST
ఎన్టీఆర్ నాతో ఆ మాట అన్నారు.. పునీత్ మరణం తర్వాత తొలిసారి శివరాజ్ కుమార్..

సారాంశం

ఎంతో మంచి మనస్సు, భవిష్యత్తు ఉన్న పునీత్ ఇలా హఠాన్మరణం చెందడంతో ఎవరూ జీర్జించుకోలేకున్నారు. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటన పునీత్ మరణం అని చెప్పొచ్చు. 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇప్పటికి అభిమానులని, కుటుంబ సభ్యులని వెంటాడుతూనే ఉంది. ఎంతో మంచి మనస్సు, భవిష్యత్తు ఉన్న పునీత్ ఇలా హఠాన్మరణం చెందడంతో ఎవరూ జీర్జించుకోలేకున్నారు. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటన పునీత్ మరణం అని చెప్పొచ్చు. 

Puneeth Rajkumar కు అన్ని చిత్ర పరిశ్రమల్లో సన్నిహితులు స్నేహితులు ఉన్నారు. పునీత్ మరణం తర్వాత నివాళి అర్పించడం కోసం తెలుగు సినీ ప్రముఖులంతా తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. పునీత్ తండ్రి రాజ్ కుమార్ హయాం నుంచి వారి కుటుంబానికి తెలుగు చిత్ర పరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. 

చిరంజీవి కుటుంబం, నందమూరి కుటుంబంతో పునీత్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, పునీత్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. పునీత్ చిత్రం కోసం ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు. పునీత్ కు నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ స్వయంగా బెంగుళూరు వెళ్లిన సంగతి తేలింది. 

Also Read: థైస్ అందాలతో నిధి అగర్వాల్ స్టన్నింగ్ ఫోటోస్.. ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్

పునీత్ మరణించి రెండు వారాలు పూర్తవుతోంది. పునీత్ సోదరుడు Shiva Rajkumar తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తమ్ముడి మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషమ పరిస్థితుల్లో తమ కుటుంబానికి చాలా మంది ప్రముఖులు ధైరం చెప్పారని శివరాజ్ కుమార్ అన్నారు. తమ్ముడి మరణంతో జూనియర్ ఎన్టీఆర్ బాగా దిగులు పడిపోయినట్లు శివరాజ్ కుమార్ అన్నారు. అయినప్పటికీ చేతిలో చేయి వేసి 'నేనున్నాను అన్నా మీకు' ధైర్యం చెప్పారని శివరాజ్ కుమార్ అన్నారు. హీరో సూర్య కూడా అండగా నిలిచారని శివరాజ్ కుమార్ తెలిపారు. 

కన్నడనాట తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న పునీత్ అక్టోబర్ 29న గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు. పునీత్ చివరగా నటించిన యువరత్న చిత్రం తెలుగులో కూడా డబ్ అయింది. 

Also Read: పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. హీరోయిన్లతో రాంచరణ్ రొమాన్స్ గురించి ఇలా, నేనూ మనిషినే..

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే