ధరమ్ తేజ్ కు ప్రమాదం: అపోలో వైద్యులతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Published : Sep 11, 2021, 08:11 AM IST
ధరమ్ తేజ్ కు ప్రమాదం: అపోలో వైద్యులతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సారాంశం

ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారు. 


వినాయక చతుర్థి వేళ టాలీవుడ్ లో అపశృతి చోటు చేసుకుంది. మెగా హీరో ధరమ్ తేజ్  రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ధరమ్ తేజ్ రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 


మొదట దగ్గర్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో ధరమ్ ని అడ్మిట్ చేశారు. అనంతరం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ధరమ్ తేజ్ మెడికల్ కండీషన్ పై అపోలో వైద్యులు గత అర్థరాత్రి బులెటిన్ విడుదల చేశారు. శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎటువంటి గాయాలు కాలేదని, కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో పాటు కొన్ని కండరాలు దెబ్బ తిన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని సదరు బులెటిన్ లో తెలియజేశారు. 


ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారు. అలాగే ధరమ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా, వైద్యుల బులెటిన్ కాపీ షేర్ చేశారు. సాయి ధరమ్ సేఫ్ గా ఉన్నారని, ఎక్స్పర్ట్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్