
హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi )కి అండగా నిలిచారు తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilisai). తమిళ పత్రికల్లో సాయి పల్లవి గురించి వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధించాయి అన్నారు గవర్నర్.
రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi ). ఈ సినిమాలో సాయి పల్లవి పెర్ఫామెన్స్ కు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు దక్కాయి. విమర్శకులు సైతం ఈసినిమాలో సాయి పల్లవి డాన్స్ అండ్ యాక్టింగ్ కు ఫిదా అవుతుంటే.. మరో వైపు ఈమూవీలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి(Sai Pallavi ) పై తమిళనాట ఓ వార్త హల్ చల్ చేసింది.ఆమె అందంగా లేదు.. నల్లగా..పొట్టిగా అంటూ రకరకాల కామెంట్లు వచ్చాయి. ఈ వార్తలు తమిళనాట సంచలనం అవుతున్నాయి. చాలా మంది సాయిపల్లవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ వార్తలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సాయి పల్లవి(Sai Pallavi )కి సపోర్ట్ గా నిలిచారు తెలంగాణ గవర్నర్ తమిళసై(Tamilisai).
రీసెంట్ గా ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని మాట్లాడారు. హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi ) గురించి బాడీ షేమింగ్ చేయడం తనను ఎంతగానో బాధించిందన్నారు తమిళసై(Tamilisai). ఇటువంటివి సమాజానికి మంచిది కాదు అన్నారు. గతంలో తన రూపాన్ని గురించి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేవారని.. రకరకాలుగా ట్రోల్ చేసేవారని... అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది. బాడీ షేమింగ్ చేస్తున్నారని తీవ్రంగా బాధపడ్డాను. కానీ నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నన్నారు గవర్నర్.
అలాంటి కామెంట్స్ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదంటూ.. సాయి పల్లవి(Sai Pallavi )ని కూడా ఇటువంటి వాటికి బాధపడవద్దుఅన్నారు తమిళసై(Tamilisai). పొట్టిగా, నల్లగా, జుట్టుతో పుట్టడం మన తప్పేమీ కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరికే రాలేదు. కాకి తన పిల్లను బంగారు పిల్లగానే భావిస్తుందే తప్ప నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా అన్నారవిడి.
అంతే కాదు ఈ సమాజంలో ఎందుకో.. మహిళలే ఎక్కువగా బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులకు అలాంటి మాటలు ఎదురవవు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యంగ్ స్టార్స్ గా చూస్తారు. కానీ స్త్రీలను మాత్రం అలా అస్సలు చూడలేరు. స్త్రీల ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఈ సమాజం మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి యత్నిస్తోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilisai) తన బాధను చెప్పుకొచ్చారు.
సాయి పల్లవి(Sai Pallavi )పై బాడీ షేమింగ్ వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాటికి తోడు తెలంగాణ గవర్నర్ కూడా సాయి పల్లవికి సపోర్డ్ గా నిలవడంతో.. మహిళా సంఘాలు సాయి(Sai Pallavi )కి అండగా నిలుస్తున్నాయి. టెక్నాలజీ ఇంతలా పెరుగుతున్న ఈ సమయంలో కూడా ఇంకా.. ఈ అనాగరికత ఏంటీ అంటూ పలువురుప్రశ్నిస్తున్నారు.