Tamannaah:సమంత ప్రెజర్..తమన్నాకు ఈ వీడియో వదలక తప్పలా

Surya Prakash   | Asianet News
Published : Jan 30, 2022, 06:41 AM ISTUpdated : Jan 30, 2022, 06:42 AM IST
Tamannaah:సమంత ప్రెజర్..తమన్నాకు ఈ వీడియో వదలక తప్పలా

సారాంశం

ఎన్ని సార్లైనా ప్రాక్టీస్ చేయడం, ఎన్ని అవకాశాలైనా ఉపయోగించుకోండి డ్యాన్స్ చేస్తూనే ఉండాలి.. నాకులాగా స్టెప్స్‌ వచ్చే వరకూ అంటూ డ్యాన్స్‌ ఛాలెంజ్‌  వీడియోని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది తమన్నా.


'కొడితే...' అంటూ  సంక్రాంతి రోజున ఓ స్పెషల్ సాంగ్‌తో  తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గని'. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌ చేసారు.  అయితే ఆ పాట అనుకున్న స్దాయిలో జనాల్లోకి వెళ్లలేదు. సమంత చేసిన ఊ అంటావా మామా ఊఊ అంటావా స్దాయిలో పేలలేదు. దాంతో ఖచ్చితంగా ఆమెపై ప్రెజర్ పడుతోంది. ఈ పాటకు క్రేజ్ తేవాలని తమన్నా ఫిక్సైంది. అందుకోసం తన వంతుగా డాన్స్ ఛాలెంజ్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ సాంగ్‌ వీడియోని షేర్ చేసిన మిల్కీ బ్యూటీ గని సినిమాలో కోడితే బీట్‌కు నేను డ్యాన్స్ చేసింది.ఆ తర్వాత మీరే ఈ స్టెప్స్  చేయాలి. ఎన్ని సార్లైనా ప్రాక్టీస్ చేయడం, ఎన్ని అవకాశాలైనా ఉపయోగించుకోండి డ్యాన్స్ చేస్తూనే ఉండాలి..నాకులాగా స్టెప్స్‌ వచ్చే వరకూ అంటూ డ్యాన్స్‌ ఛాలెంజ్‌  వీడియోని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది తమన్నా.

ఈ మాస్‌ ఐటమ్ సాంగ్‌ కోసం తమన్నా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ బాగా చేసిందని అర్దమవుతోంది. కొడితే (Kodithe)అన్న చరణంలో మొదలయ్యే సాంగ్‌ కోసం తమన్‌  మంచి మాస్‌ బీట్‌ ఉన్న మ్యూజిక్‌ కంపోజ్ చేస్తే..అందుకు తగినట్లుగా తమన్నా కష్టపడింది.  

బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా తెరకెక్కుతోంది. తమన్నా స్పెష‌ల్ సాంగ్‌ను కూడా బాక్సింగ్ రింగ్‌లో డిజైన్ చేశారు. అందుకు తగ్గట్టు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ పాటను ఆలపించారు. లిరిక‌ల్ వీడియోలో త‌మ‌న్నా వేసిన కొన్ని స్టెప్స్ కూడా చూపించారు.  తమన్నా పాటలో ఇరగదీశారని, తమన్ ట్రాక్ నచ్చిందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు. ఈ ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే