
దూకుడు చూపిస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya). తగ్గేది లేదంటున్నాడు. కెరీర్ లో ఇన్నాళకు మంచి బ్రేక్ వచ్చింది చైతూకి. అందుకే మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూనే.. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు.
నాగచైతన్య(Naga Chaitanya) వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. మజిలీ నుంచి స్టార్ట్ అయిన విజయాల పరంపర..కరోనా వల్ల మధ్యలో బ్రేక్ పడ్డా.. ఆతరువాతి నుంచి సక్సెస్ పుల్ గా సాగిపోతోంది. మజిలీ సినిమా నుంచే తన సెలక్షన్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేసేశాడు చైతూ(Naga Chaitanya). ఇక లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చైతన్య.. రీసెంట్ గా బంగార్రాజు తో సంక్రాంతి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2022 ను సక్సెస్ తో శుభారంభం చేశారు నాగచైతన్య(Naga Chaitanya).
ఇదే ఊపుతో ఇక తన నెక్ట్స్ మూవీపై గట్టిగా ఫోకస్ చేశాడు అక్కినేని హీరో. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీషూటింగ్ ప్రస్తుతం మాస్కోలో జరుగుతుంది. దాదాపు ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది.ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనే నాగచైతన్య(Naga Chaitanya) ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. మూడు భాగాలు గా తెరకెక్కనున్న ఈ సిరీస్ లలో చైతూ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
వీటీతో పాటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ ఎప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న నాగచైతన్య(Naga Chaitanya) మరికొంత మంది దర్శకులకుకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో తాజాగా ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.రీసెంట్ గా వెంకట్.. మానాడు సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమాను ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ వారు రీమేక్ చేస్తున్నారు. ఆపనుల మీద ఇటువైపు వచ్చిన వెంకట్ ప్రభు పనిలో పనిగా చైతూ(Naga Chaitanya)ను కలిసాడట..వెంటనే కథ చెప్పడం చైతూ ఓకే చెప్పడం జరిగిపోయిందని సమాచారం.
చైతూతో సినిమాలు చేయడానికి మరికొంత మంది దర్శకులు రెడీగా ఉన్నారు. మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న పరశురామ్ ఎప్పుడో నాగచైతన్య కోసమే కథరాసి పెట్టుకున్నాడు.. అటు విజయ్ కనకమేడల కూడా చైతన్య కోసం ఎదురు చూస్తున్నాడు. వీరితో పాటు గతంలో చైతన్యతో సినిమా దాదాపు ఫిక్స్ చేసుకుని కొన్ని కారణాల వల్ల కాన్సిట్ అయిన నందిని రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య తో సినిమా కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఈ ప్రాజెక్టులలో ఎవరితో ముందుగా ఆయన సెట్స్ పైకి వెళతాడనేది చూడాలి.