
ఆర్ఆర్ఆర్ (RRR Movie) మూవీ మార్చి 25న గ్రాండ్ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ఒకింత ఇబ్బంది పరిస్థితులు నెలకొన్న సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యైసర్ దానయ్ మార్చి 14న ఏపీ సీఎం జగన్ (CM Jagan)ని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో భేటి అయ్యాక రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే భారీ బడ్జెట్ మూవీ కావడంతో అవసరమైన చర్యలు, ప్రయోజనాలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే రాధే శ్యామ్ (Radhe Shyam) మూవీ విడుదలతోనే ఏపీలో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. పాత రేట్లను పునరుద్దరిస్తూ కొత్త రేట్లతో కూడిన జీవోని ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అత్యధికంగా రూ. 275 గా టికెట్స్ ధరలను ఏపీ ప్రభుతం నిర్ణయించింది. అయినప్పటీకీ రాజమౌళి సీఎంని కలిశారు.
ఈ విషయంలో సీఎం జగన్ ఇలా స్పందిస్తూ.. ‘ప్రేక్షకులపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే టికెట్ రేట్ల ధరలను తగ్గించాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో మరోసారి పునరాలోచన చేసి నిర్ణయిస్తాం’ అని తెలిపినట్టు సమచారం. ఇక సినిమాకు ఐదురోజుల సమయం ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం ‘ఆర్ఆర్ఆర్’కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. పది రోజుల పాటు సినిమాకి హైక్స్ ఇచ్చింది. ఏసీ, నాన్ ఏసీ సింగిల్ థియేటర్స్ లో రూ.30 నుంచి రూ.50 వరకు, లార్జ్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లలో రూ.50 నుంచి రూ.100 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఈ నిబంధనలు అన్నీ పది రోజుల వరకు వర్తిస్తాయని, ఆ తర్వాత యథావిధంగానే సినిమా ఆడనున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు తెలంగాణ రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి మళ్లీ ఉదయం ఒంటి గంట వరకు రిలాక్సెషన్ ఇచ్చింది. ఇందుకు ఆర్ఆర్ఆర్ టీం ఎంతో సంతోషిస్తోంది.