
ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమాపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ సినిమా బృందాన్ని ప్రశంసిస్తుండగా.. మరి కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మొత్తంగా ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్నది. మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు 600లకు పైగా థియేటర్లలో ఆడింది. కానీ ఎనిమిది రోజుల్లో 4000 థియేటర్లలో దేశ వ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ రన్ అవుతోంది. దీన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటోంది అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ టీమ్ ను ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కూడా స్వయంగా తన వద్దకు పిలిపించుకుని ప్రశంసించారు.
మరోవైపు మూవీపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. అటు పలువురు ముస్లిమ్, సిక్కుకు చెందిన ఆడియెన్స్ తో పాటు.. ఇటు రాజకీయ నాయకులు కూడా ఈ మూవీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ నేతలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) ఈ చిత్రంపై స్పందించారు. నిన్న నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఈ సినిమాపై మాట్లాడారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో చాలా అబద్దాలు చూపించారని తను అభిప్రాయపడ్డారు.
కాగా తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్ వేదికన స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ‘ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొడుంతుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? ఊరికే అడుగుతున్నా..’ అంటూ ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ యువకుడు సినిమా చూసిన అనంతరం ఆవేశపూరితంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పట్ల ప్రకాష్ రాజ్ ఇలా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. కేరీర్ విషయానికొస్తే ప్రకాష్ రాజ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ ప్రస్తుతం డజన్ మూవీల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KFG 2) లో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.