ప్లీజ్.. అక్టోబర్ వరకు ఓపిక పట్టండి, సినిమాలను ఓటీటీలకు ఇవ్వొద్దు: నిర్మాతలకు ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి

By Siva KodatiFirst Published Jul 3, 2021, 6:37 PM IST
Highlights

తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొందరపడి ఓటీటీలకు సినిమాలను అమ్ముకోవద్దని నిర్మాతలను కోరాలని తీర్మానించారు. ప్రస్తుతానికి ఓటీటీ వ్యవహారాలు బాగానే వున్నా.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు

తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొందరపడి ఓటీటీలకు సినిమాలను అమ్ముకోవద్దని నిర్మాతలను కోరాలని తీర్మానించారు. ప్రస్తుతానికి ఓటీటీ వ్యవహారాలు బాగానే వున్నా.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీల వల్ల ధియేటర్ వ్యవస్థ పూర్తిగా పతనమయ్యే ప్రమాదముందని అంటున్నారు. అప్పుడు ఓటీటీ గుత్తాధిపత్యం ప్రదర్శించే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఎగ్జిబిటర్లు.

Also Read:డైరెక్ట్ ఓటీటీలో దృశ్యం2, నారప్ప, విరాటపర్వం ? పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం కంటే ఇదే బెటరా?

కరోనా పరిస్ధితులు చక్కబడిన తర్వాత ధియేటర్లు తెరచుకుంటాయని అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఇక ఆ రోజులు ఎంతో దూరంలో లేదు అంటూ కూడా వారు చెబుతున్నారు. అక్టోబర్ చివరి నాటికి నిర్మాతలు తమ సినిమాలను హోల్డ్ చేసి పెట్టాలని అడుగుతున్నారు. ఓటీటీలకు ఎట్టి పరిస్ధితుల్లో అమ్ముకోవద్దని.. అప్పటికీ పరిస్ధితులు చక్కబడకపోతే ఓటీటీకి ఇచ్చుకోవచ్చని ఎగ్జిబిటర్లు సూచించారు. అయితే ఈలోగా మాత్రం ఇవ్వొద్దని కోరుతూ వారు తీర్మానం  చేశారు. ఒకవేళ అలా ఎవరైనా కూడా అక్టోబర్‌లోగా ఓటీటీకి సినిమాలు ఇస్తే.. ఏ విధమైన కార్యచరణలోకి దిగాలన్నది కూడా త్వరలోనే చెబుతామని చెప్పారు ఎగ్జిబిటర్లు. 

click me!