మెహరీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌.. మా ప్రైవసీకి ప్రయారిటీ ఇవ్వండి!

Published : Jul 03, 2021, 05:09 PM ISTUpdated : Jul 03, 2021, 05:48 PM IST
మెహరీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌.. మా ప్రైవసీకి ప్రయారిటీ ఇవ్వండి!

సారాంశం

కరోనా వల్ల తమ మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వస్తోందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన మెహరీన్‌ ఇప్పుడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. తాను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నట్టు సంచలన ప్రకటన చేసింది.

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. ఇటీవల ఆమె హర్యానాకి చెందిన మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల తమ మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వస్తోందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన మెహరీన్‌ ఇప్పుడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. తాను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నట్టు తెలిపారు. ఇకపై భవ్యతోగానీ, వారి ఫ్యామిలీతోగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు  సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది మెహరీన్‌.

ఇందులో మెహరీన్‌ చెబుతూ, `భవ్య బిష్ణోయ్‌, నేను ఎంగేజ్‌మెంట్‌కి బ్రేక్‌ ఆఫ్‌ చేయాలనుకుంటున్నాం. మేం పెళ్లి వరకు వెళ్లడం లేదు. ఇది ఇద్దరం కలిసి, మా ఇష్ట పూర్వకంగా తీసుకున్న నిర్ణయం. మున్ముందు భవ్య బిష్ణోయ్‌తోగానీ, వారి ఫ్యామిలీతోగానీ, ఫ్రెండ్స్ తోగానీ ఎలాంటి సంబంధాలు కొనసాగించాలనుకోవడం లేదు.

ఇది పూర్తిగా మా ప్రైవేట్‌ మ్యాటర్‌. ఈ విషయంలో మా ప్రైవసీని గౌరవించండి. దీన్ని అందరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇకపై నేను సినిమాల్లో కొనసాగుతాను. మరిన్ని సినిమాల్లో నా బెస్ట్ అవుట్‌పుట్‌ ఇస్తాను` అని తెలిపింది మెహరీన్‌. ప్రస్తుతం మెహరీన్‌ `ఎఫ్‌3`తోపాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్