తెలంగాణ ఎలక్షన్స్: పరువు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్!

By Prashanth MFirst Published Dec 11, 2018, 4:10 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టకేలకు చివరిదశలో ఊహించని మలుపు తిప్పాయి. అయితే హైదరాబాద్ లో అందరి ద్రుష్టి ఎక్కువగా కూకట్ పల్లి వైపు వెళ్లింది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని మొదటిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో చర్చనీయాంశంగా మరీన సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టకేలకు చివరిదశలో ఊహించని మలుపు తిప్పాయి. అయితే హైదరాబాద్ లో అందరి ద్రుష్టి ఎక్కువగా కూకట్ పల్లి వైపు వెళ్లింది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని మొదటిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో చర్చనీయాంశంగా మరీన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఓటమి దిశగా అడుగులు వేయడంతో అంచనాలు తారుమారయ్యాయి. 

టీఆరెస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 40 వేల మెజారిటీతో ముందంజలో ఉండడంతో దాదాపు సుహాసిని ఓటమి ఖాయమైనట్లు తేలిపోయింది.    అయితే ఈ ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాల్లో పాల్గొనకుండా పరువు దక్కించుకున్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణ బిజీగా ప్రచారాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన డైలాగులతో పద్యాలతో హంగామా చేసినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి అవకాశం ఇవ్వడమే తప్ప చేసిందేమి లేదని టాక్ వస్తోంది. 

ఇక తారకరత్న - జానకిరామ్ సతీమణి కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు. కానీ ఏ దశలోనూ వారి ప్రసంగాలు ఉపయోగపడలేదు. కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉందని ముందుఅనేక కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. లాస్ట్ మినట్ లో జూనియర్ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు అంతా మంచే జరిగిందని అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ప్రచారాల్లో ఉంటె ఎంతవరకు లాభం చేకూరేదో చెప్పడం కష్టమే. మరి ఈ ఓటమితో చంద్రన్న అడుగులు తెలంగాణలో ఏ విధంగా ఉంటాయో చూడాలి. 

click me!