తెలంగాణ పోలీస్ సేవలపై కీరవాణి పాట.. డీజీపీ ప్రశంస

Published : Oct 31, 2020, 07:48 PM IST
తెలంగాణ పోలీస్ సేవలపై కీరవాణి పాట.. డీజీపీ ప్రశంస

సారాంశం

తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అద్భుతమైన పాటని స్వరపరిచారు. `పోలీస్‌.. పోలీస్‌.. తెలంగాణా పోలీస్‌.. ప్రాణం పంచే మనసున్న పోలీస్‌.. ` అంటూ సాగే పాటని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. 

తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అద్భుతమైన పాటని స్వరపరిచారు. `పోలీస్‌.. పోలీస్‌.. తెలంగాణా పోలీస్‌.. ప్రాణం పంచే మనసున్న పోలీస్‌.. ` అంటూ సాగే పాటని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణితోపాటు సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఉమేష్‌ ష్రాఫ్‌, జితేందర్‌, సందీప్‌ శాండిల్య, శివధర్‌ రెడ్డి, నాగిరెడ్డి, బాలనాగాదేవి, వెంకటేశ్వర్లు, పాట ఎడిటర్‌ హైమా రెడ్డి పాల్గొన్నారు. 

ఈ పాటని గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రచించడం విశేషం. ఈ నెల 21 నుంచి నేడు(శనివారం) వరకు నిర్వహించిన పోలీస్‌ ప్లాడ్‌ డే కార్యక్రమాల సందర్భంగా ఈ పాటని విడుదల చేయడం సందర్భోచితంగా ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవాలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించాని అన్నారు. మనం కష్టపడుతూ సేవలందిస్తుంటూ మనతో ఎంతో మంది కలిసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు. 

`మాతృదేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఆ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను సంగీత దర్శకుడు కీరవాణి ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయసులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్‌ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలిపారు. ఇస్తున్న ప్రాణం మీ కోసం అనే పోలీస్‌ త్యాగాలను తెలియజేసే పాటను 1998లో అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరిచి పాడానని చెప్పారు. ఈ పాటని హిందీలో కూడా కంపోజ్‌ చేస్తానని కీరవాణి తెలియజేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్