హీరో రాజశేఖర్‌ ఆరోగ్యంపై తాజా అప్ డేట్ హెల్త్ బులెటిన్‌

Published : Oct 31, 2020, 06:10 PM ISTUpdated : Oct 31, 2020, 06:21 PM IST
హీరో రాజశేఖర్‌ ఆరోగ్యంపై తాజా అప్ డేట్ హెల్త్ బులెటిన్‌

సారాంశం

శనివారం సాయంత్రం రాజశేఖర్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు. ఆయన కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పారు.

హీరో రాజశేఖర్‌ కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయనకు, ఆయన ఫ్యామిలీకి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే వారిలో రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని ఆయన కుమార్తె శివాత్మిక వెల్లడించింది. దీంతో చిరంజీవి, మోహన్‌బాబు వంటి సినీ వర్గాలు స్పందించి ధైర్యాన్నిచ్చారు. అదే సమయంలో సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తున్నారు. 

శనివారం సాయంత్రం రాజశేఖర్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తున్నారని చెప్పారు. తమ వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్‌ చివరగా గతేడాది `కల్కి` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా మరేది ఇంకా కన్ఫమ్‌ కాలేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌