మరణవార్త చెప్పలేదు...చివరి చూపు లేదు, ఇంటికి వెళ్లి బోరున విలపించిన దివి

Published : Oct 31, 2020, 03:55 PM IST
మరణవార్త చెప్పలేదు...చివరి చూపు లేదు, ఇంటికి వెళ్లి బోరున విలపించిన దివి

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా దివి నిలిచారు. దాదాపు 50రోజులు హౌస్ లో గడిపిన దివి ఏడవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ నుండి బయటికి వచ్చిన దివి ఛేదు వార్త వినాల్సి వచ్చిందట. ఆ విషయం చెప్పుకొని దివి ఎమోషనల్ అయ్యారు.

ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు, వారానికి ఒకసారి వచ్చి పలకరించే హోస్ట్ తో తప్ప మరెవరితో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండడానికి వీలు లేదు. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులు తెలియపరచరని తాజా ఉదంతం ద్వారా తెలుస్తుంది. 

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా దివి తాతగారు మరణించారట. ఆ విషయం బిగ్ బాస్ నిర్వాహకులు దివికి తెలియపరచలేదు. గత వారం ఎలిమినేటై ఇంటికి వెళ్లిన దివి అమ్మమ్మను చూసి తాతయ్య ఎక్కడని అడుగగా ఆమె గట్టిగా ఏడ్చేశారట. తాతయ్య చనిపోయారని తెలుసుకున్న దివి షాక్ కి గురయ్యారట. మొదటివారం ఎలిమినేషన్ సమయంలో ఇది జరిగిందని దివి చెప్పుకొచ్చారు. 

అలాగే తాతయ్యతో ఆమెకు గల అనుబంధాన్ని దివి గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ అవుతా అంటే ఇంట్లో వాళ్ళు ససేమిరా అన్నారట. తాతయ్య మాత్రమే ప్రోత్సహించి పరిశ్రమకు రావడానికి కారణం అయ్యారట. అందగాడైన దివి తాతయ్యకు అప్పట్లో జగ్గయ్యతో పాటు నటించే అవకాశం ఉందని లెటర్ వచ్చిందట.  ఆ విషయం దివి తాతయ్య వాళ్ళ నాన్నతో చెవితో ఆయన కోప్పడ్డారట. నటిగా నేను సక్సెస్ కావాలని కోరుకున్న,  తాతయ్యను చివరి చూపు కూడా చూసుకోలేక పోయానని దివి బాధపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు