
యువ హీరో తేజా సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ (Hanu Man). యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై భారీ హైప్ ను తీసుకొచ్చింది. ఇక తాజాగా హైదరాబాద్ లో Hanuman Trailer Event ను గ్రాండ్ ా నిర్వహించారు. ట్రైలర్ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కుతోంది.
అయితే, ఈవెంట్ లో మాత్రం తేజా సజ్జ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ పాత్రకు మీ స్థాయికి మించి ఉంటుందని అనిపించిందా అంటూ ఈవెంట్ లో అడిగిన ప్రశ్నకు తేజ సజ్జా సాలిడ్ రిప్లై ఇచ్చారు. ’మరోలా అనుకోకండి... ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్ ఇండస్ట్రీకి వచ్చి.. ఫస్ట్ సినిమా తర్వాత పెద్ద సినిమా చేస్తే ఇలాంటి ప్రశ్నలు అడగటం లేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి.. సినిమా కోసం ఎంత కష్టపడ్డప్పటికీ సరిపోతారా అని ప్రశ్నించడం నాకు చిన్నచూపుగా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డ.. డైరెక్టర్ గారికి ఆ విషయం తెలుసు. అవుట్ పుట్ చాలా బాగుంటుంది. హనుమాన్ రూపంలో నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఈ సినిమా నుంచి నన్ను ఇంకెవ్వరూ దూరం చేయలేరు’. అంటూ చెప్పుకొచ్చారు.
తేజా తన సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను ప్రారంభించిన తేజ 25 ఏళ్ల కెరీర్ నే పూర్తి చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం హీరోగా అలరిస్తున్నారు. ‘జాంబిరెడ్డి’తో గతంలో మంచి హిట్ అందుకున్నారు. మళ్లీ అదే డైరెక్టర్ తో ఇప్పుడు Hanu-Manతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టీమ్ కు ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.
సూపర్ హీరో ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘హనుమాన్’ ట్రైలర్ అదిరిపోయింది. మూవీ నుంచి రాబోయే మరిన్ని అప్డేట్స్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ గా ఏకంగా 11 దేశాల్లో రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రైలర్ ను కూడా ఇండియన్ లాంగ్వేజీలతో పాటు ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేశారు. చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రపోషించారు. జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.