TeesMaarKhan Trailer: తీస్ మార్ ఖాన్ ట్రైలర్... రూత్ లెస్ పోలీస్ గా ఆది అదుర్స్!

Published : Aug 08, 2022, 03:56 PM IST
TeesMaarKhan Trailer: తీస్ మార్ ఖాన్ ట్రైలర్... రూత్ లెస్ పోలీస్ గా ఆది అదుర్స్!

సారాంశం

ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. విడుదలకు సిద్దమైన ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్ మార్ ఖాన్ తెరకెక్కి నట్లు తెలుస్తోంది.


హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తున్నాడు ఆది సాయి కుమార్(Aadi Saikumar). ఆది డెబ్యూ మూవీ ప్రేమ కావాలి మాత్రమే ఆయన కెరీర్ లో హిట్ నమోదు చేసింది. మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుని ఆది ఆ టెంపో కొనసాగించలేకపోయాడు. వరుస పరాజయాలతో ఫేమ్ కోల్పోయాడు. పదుల సంఖ్యలో ప్లాప్స్ ఇచ్చినా ఆదికి అవకాశాలు రావడం విశేషం. సాలిడ్ హిట్ తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనేది ఆయన కోరిక. ఈ క్రమంలో ఆయన అనేక జోనర్స్ ట్రై చేశారు. 

ఇక ఆది నటించిన లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. ఆగస్టు 19న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. తీస్ మార్ ఖాన్(TeesMaarKhan Trailer) మూవీలో రూత్ లెస్ పోలీస్ అధికారిగా ఆది రోల్ ఉంది. ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఊరమాస్ గా దర్శకుడు డిజైన్ చేశాడు. ఈ మూవీలో ఆదికి జంటగా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి హాట్ హాట్ సన్నివేశాలతో రచ్చ చేసినట్లు ట్రైలర్ తో స్పష్టంగా అర్థం అవుతుంది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. 

సునీల్, పూర్ణ కీలకర్ రోల్స్ చేస్తున్న ఈ మూవీకి కళ్యాణ్ జి గోగున దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ లో నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. తీస్ మార్ ఖాన్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీతో అయినా ఆదికి హిట్ పడుతుందేమో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే