Liger:‘లైగ‌ర్‌’స్టార్స్ అక్కడ ఏం చేస్తున్నారో గమనించారా?

By Surya PrakashFirst Published Aug 8, 2022, 3:55 PM IST
Highlights

ఈ రోజు లైగర్ హీరో,హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, అనన్య ఇద్దరూ అహ్మదాబాద్ లో గుజరాతి థాలీ తీసుకుంటూ కనిపించారు. అనంతరం అక్కడ లోకల్ మీడియాకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.


రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన సినిమాలకు గ్యాప్ వచ్చింది. చివరగా  'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్‌  సినిమా చేసే ఛాస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమే 'లైగర్'. ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీమ్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. దేశం మొత్తం భారీ ఎత్తున రిలీజ్ చేస్తూండటంతో అన్ని ముఖ్యమైన ప్రాంతాలను తమ సినిమా ప్రమోషన్స్ తో కవర్ చేస్తున్నారు.

ఈ రోజు లైగర్ హీరో,హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, అనన్య ఇద్దరూ అహ్మదాబాద్ లో గుజరాతి థాలీ తీసుకుంటూ కనిపించారు. అనంతరం అక్కడ లోకల్ మీడియాకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక “లైగర్” ప్రమోషన్  కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా  నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. అదే సీన్ బీహార్ రాజధాని పాట్నాలోనూ కనిపించింది. అక్కడి ఏఎన్ కాలేజీలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ కూడా ముంబైలాగే భారీ జన సమూహం వల్ల ఈవెంట్ రద్దు చేశారు.

Biharr ❤️
I Loved seeing you all..
Till I come next - I'll see you in the theaters August 25th. pic.twitter.com/RKjPE6CwP3


 
ఈ నేపధ్యంలో పెరిగిన క్రేజ్ కు అణుగుణంగా ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.98 కోట్ల‌కు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రెండూ హాట్ స్టార్ తీసుకుంది. ఇందులో 65 కోట్లు కేవలం ఓటిటి నిమిత్తమే అంటున్నారు. హిందీ,తెలుగు,తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ రేటు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 160 కోట్లు బడ్జెట్ అయ్యిందని, ఇలా నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ నుంచే రూ.98 కోట్లు తెచ్చుకొందంటే మాగ్జిమం రికవరీ అయ్యినట్లే. 

ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ పోరడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ.  హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో  సునీల్ శెట్టి (Sunil Shetty) డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం. 

click me!