
ప్రముఖ తెలుగు దర్శకుడు కోదండ రామిరెడ్డి ఇంట్లో పనిచేస్తున్న పంతొమ్మిదేళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడటం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. తూర్పు గోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన యువతి జయశ్రీ (19) సంవత్సర కాలంగా దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తూ....అదే ఇంటి ఆవరణలోని ఓ గదిలో నివాసం ఉంటోంది.
పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన ఆ యువతి, తిరిగి వచ్చేటప్పుడు తన తల్లి నాగమణిని కూడా తన వెంట తీసుకొచ్చింది. అప్పటి నుండి ఇద్దరూ కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తున్నారు.
తన తల్లి బయటకు వెళ్లి వచ్చే సరికి జయశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరి జయశ్రీ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.