Suma: యాంకర్ సుమ సినిమాపై ...టీడీపీ ఎంపీ ఇంట్రస్టింగ్ కామెంట్

Surya Prakash   | Asianet News
Published : Apr 18, 2022, 09:55 AM IST
Suma: యాంకర్ సుమ సినిమాపై ...టీడీపీ ఎంపీ ఇంట్రస్టింగ్ కామెంట్

సారాంశం

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సెటైర్లు వేస్తూ ఉండే సుమ పవర్ ఫుల్ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.


ప్రముఖ యాంకర్ మరియు నటి సుమ నటించిన సినిమా జయమ్మ పంచాయితీ.. ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వేసవి కానుకగా ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తోంది.. కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సెటైర్లు వేస్తూ ఉండే సుమ పవర్ ఫుల్ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాపై టీడీపీ ఎంపీ  రామ్మోహన్‌ నాయుడు ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ట్రైలర్‌ బాగుందని సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ''శ్రీకాకుళం(Srikakulam) యాసతో సినిమాలు రూపొందించడాన్ని చూసి నేను గర్వపడుతున్నా. మన భాష, సంస్కృతి చూపించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి'' అని ఆకాంక్షించారు.

" రా బావా మా ఊరి పంచాయితీ సూద్దువుగాని, ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవొకటి మా ఊర్లో జరుగుతాంది" అనే మాటలతో ట్రైలర్ సాగింది. నా కర్మేంటో ఊళ్లో సమస్యలన్నీ మా ఆయన జబ్బు సుట్టే ఉన్నాయి అంటూ సుమ చెప్పే డైలాగులు, పండించే హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఊరి సమస్యల పరిష్కారానికి జయమ్మ కొంగుబిగిస్తుంది.. ఊరిని ఒకదారిలోకి తెస్తుందనే విషయం ట్రైలర్ లో కనిపిస్తుంది.

సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తిగా  కామెడీ ఎంటర్‌టైనర్‌గా జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) వస్తుంది. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరి వాతావరణం కనిపించనుంది. చాలాకాలం తర్వాత సుమ వెండితెరపై ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. బలగ ప్రకాశ్‌ నిర్మించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనూష్‌ కుమార్‌. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..