
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న బిగ్ మూవీ హరి హర వీరమల్లు. దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఖుషి నిర్మాత ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారి నటిస్తున్న పీరియాడిక్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్ లో స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు.
కాబట్టి కథ పరంగా పవన్ ఎప్పటి కప్పుడు వేషధారణ మార్చుకోవాల్సి ఉంది. దీని కోసం పవన్ దాదాపు 30 వేషధారణలలో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఆల్రెడీ ఒక గెటప్ ని ఫస్ట్ లుక్ రూపంలో విడుదల చేశారు. ఇక మిగిలిన లుక్స్ ఎలా ఉంటాయనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది. పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడు కాబట్టి అన్ని గెటప్పులు సహజమే అంటున్నారు ఫ్యాన్స్.
దర్శకుడు క్రిష్ కనీవినీ ఎరుగని విధంగా పవన్ ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నారట. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.