పెద్దయ్యాక నాన్నలా అవుతా.. కన్నీరు పెట్టిస్తున్న తారకరత్న కూతురు ఫోటో!

Published : Mar 29, 2023, 05:32 PM IST
పెద్దయ్యాక నాన్నలా అవుతా.. కన్నీరు పెట్టిస్తున్న తారకరత్న కూతురు ఫోటో!

సారాంశం

తారకరత్న మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర వేదనకు గురవుతున్నారు. భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకున్నారు. అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ కన్నీరు పెట్టిస్తున్నాయి.   

తారకరత్నతో అలేఖ్య రెడ్డిది ఒడిదుడుకుల జీవితం. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నిరాదరణకు గురయ్యారు. చాలా కాలం తల్లిదండ్రుల మద్దతు లేకుండా జీవించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కున్నారు. పిల్లలు పుట్టాక కుటుంబంలో సంతోషం మొదలైంది. ఇప్పుడిప్పుడే ఆనందకర జీవితం అనుభవిస్తుండగా... ఊహించని విషాదం చోటు చేసుకుంది తారకరత్న అకాల మరణం పొందారు. 

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన తారకరత్న సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నారు. ఆయన కోలుకుని తిరిగి వస్తారని అభిమానులు భావించారు. దురదృష్టవశాత్తు తారకరత్న అందరినీ వదిలిపోయారు. తారకరత్న మరణం భార్య అలేఖ్య రెడ్డిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. అందుకు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కూతురు ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫొటోల్లో కూతురు నిష్క నందమూరి నాన్న తారకరత్న ఫోటో పట్టుకుని ఉంది. ఆ ఫోటోలకు 'పెద్దయ్యాక నాన్నలా అవుతా' అనే క్యాప్షన్ ఇచ్చారు. పసిప్రాయంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ పిల్లలను చూస్తుంటే మనసు కలచి వేస్తుంది. ఇక పిల్లలలో భర్త తారకరత్నను అలేఖ్య రెడ్డి చూసుకుంటున్నారని అర్థం అవుతుంది. 

జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికి తారకరత్న కుప్పకూలిపోయారు. ఆయన్ని కుప్పంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తీసుకెళ్లి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 23 రోజు చికిత్స తీసుకున్న తారకరత్న మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన