
వరస హిట్స్ లేకపోయినా తను చేస్తున్న విభిన్నమైన సబ్జెక్టులతో క్రేజ్ సాధించి నేచురల్ స్టార్ నాని నెక్ట్స్ లెవిల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి పాన్-ఇండియన్ మూవీ దసరా. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని, తనేంటో ఇండస్ట్రీకి చూపాలని ఆశిస్తున్నాడు నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో మూవీ టీమ్ ఫుల్ బిజీగా ఉంది.
మరో ప్రక్క ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, సినిమాకి హైదరాబాద్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సింగిల్-స్క్రీన్ సినిమాస్, మల్టీప్లెక్స్‌లలో బుకింగ్‌లు ఓపన్ అయ్యాయి. చాలా షోలు ఇప్పటికే సేల్ అయ్యి హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పస్ట్ డే ఎంత కలెక్ట్ చేయచ్చు అనే అంచనాలు ,లెక్కలు మొదలయ్యాయి. ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం ...ఈ చిత్రం తెలుగులో వరల్డ్ వైడ్ గా 17 కోట్లు దాకా మొదటి రోజు వసూలు చేసే అవకాసం ఉంది. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం మొదటి రోజు 14 కోట్లు వసూలు చేసింది.
ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా దసరా కు సెన్సార్ కట్స్ పడ్డాయి. ఫస్టాప్‌లో 20, సెకండాఫ్‌లో 16 మొత్తం 36 కట్స్ విధించినట్లు తెలుస్తోంది. కట్స్‌తో పాటు కొన్ని పదాలను మ్యూట్ చేయాలని, ధూమపానం, మద్యపానానికి సంబంధించి వచ్చే డిస్‌క్లైమర్ ఫాంట్‌ను పెద్ద సైజ్‌లో చూపించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, హింసాత్మక సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని సూచిస్తూ.. సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా సమాచారం. సెన్సార్ బోర్డు సూచించిన కటింగ్ సన్నివేశాలన్నీ పోగా.. చిత్ర నిడివి 2 గంటల 39 నిమిషాలు ఉండబోతోంది. అయితే సినిమాపై, నాని నటనపై మాత్రం సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.