'దసరా' కి నాని, కీర్తి సురేష్ ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

Published : Mar 29, 2023, 05:30 PM IST
  'దసరా' కి నాని, కీర్తి సురేష్ ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

సారాంశం

 ఈ చిత్రం కోసం నాని తెగ కష్టపడ్డారు. ఏకంగా నెల రోజులు పాటు కంటిన్యూగా ప్రమోషన్స్ చేసారు. కీర్తి సురేష్ సైతం ప్రమోషన్స్ పాల్గొంది.


 నాని హీరోగా రూపొందిన  ద‌స‌రా సినిమా మార్చి 30న అంటే రేపు  ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నాని కెరియర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ ‘దసరా’.. నానికి తొలి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. విడుదలకు ముందే రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నాని కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌కి రెడీ అయ్యింది ‘దసరా’. తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు.

 ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించిన నాటి నుంచి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది.  అలాగే ఈ చిత్రం కోసం నాని తెగ కష్టపడ్డారు. ఏకంగా నెల రోజులు పాటు కంటిన్యూగా ప్రమోషన్స్ చేసారు. కీర్తి సురేష్ సైతం ప్రమోషన్స్ పాల్గొంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం నాని, కీర్తి సురేష్ లకు ఎంత పే చేసారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే దాని ప్రకారం ...ఈ సినిమా నిమిత్తం భారీ రెమ్యునరేషన్స్ నానికి,కీర్తి సురేష్ కు అందాయి. నానికు 15 కోట్లు , కీర్తి సురేష్ కు రెండు కోట్లు ఈ సినిమాకు లభించిందని టాక్.ఈ  సినిమా ముందు నాని 12 కోట్లు తీసుకునే వారు. ఈ సినిమాకు మూడు కోట్ల ఎగస్ట్రా తీసుకున్నారు. దసరా కనుక సూపర్ హిట్ అయితే ఇంకా పెంచి అది ఏ ఇరవై కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.
 
 టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన రావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా 2700కు పైగా థియేటర్లలో భారీ విడుదలకు రెడీ అయ్యింది దసరా.  ఈ సినిమాకి చేస్తున్న భారీ ప్రమోషన్స్ తో హైప్ ని అలా మేకర్స్ కొనసాగిస్తున్నారు. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో మాసివ్ బుకింగ్స్ దసరా కి సెట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి నైజాం లో అయితే దసరా మ్యానియా గట్టిగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు