తారకరత్నని గుర్తు చేసుకుంటూ కూతురు ఎమోషనల్‌.. వీడియో షేర్‌ చేసిన అలేఖ్య రెడ్డి

Published : Feb 04, 2024, 03:54 PM ISTUpdated : Feb 04, 2024, 04:49 PM IST
తారకరత్నని గుర్తు చేసుకుంటూ కూతురు ఎమోషనల్‌.. వీడియో షేర్‌ చేసిన అలేఖ్య రెడ్డి

సారాంశం

నందమూరి హీరో తారకరత్న గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా తండ్రిని గుర్తు చేసుకున్నారు కూతుళ్లు. వీడియో వైరల్‌ అవుతుంది.

నటుడు తారకరత్న గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఆయన నారా లోకేష్‌ నిర్వహించిన `యువగళం` పాదయాత్ర(జనవరి 26)లో పాల్గొని అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆయన గుండె పోటుకి గురయ్యాడు. పాదయాత్రలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. దాదాపు ఇరవై రోజులపాటు పోరాడి చివరికి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. 

ఆయన మరణించి ఏడాది కావస్తుంది. ఇది ఫిబ్రవరి నెల కావడంతో ఏడాది కార్యక్రమాలకు (మొదటి వర్థంతి) సిద్ధమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా తారకరత్నని గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా వారికి పిల్లలు, భార అలేఖ్య రెడ్డి తారకరత్న ఆలోచనలతోనే ఉన్నారు. పిల్లలు మాత్రం తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఆయనపై ప్రేమని చాటి చెబుతున్నారు. 

తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి  ఓ వీడియోని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఇందులో పెద్దకూతురు తండ్రి చిత్ర పటం వద్ద కనిపించింది. ఆయన్ని స్మరించుకుంది. డాన్సు చేసింది. తండ్రితో మాట్లాడింది. అందరు కలిసి ఆడుకున్నారు. తల్లి అలేఖ్య రెడ్డితో కలిసి సరదాగా గడిపారు. మరోవైపు తాతయ్య విజయ సాయి రెడ్డిని చూసి ఒక్కసారిగా ఆయన వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నారు. ఇదంతా చాలా ఎమోషనల్‌గా ఉంది. గుండెని బరువెక్కించేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

తారకరత్నది, అలేఖ్యరెడ్డిని ప్రేమ వివాహం. ఆమెని 2012లో ఈ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్‌ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ వీళ్ల పెళ్లికి ఇరు కుంటుంబాలు అంగీకరించలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్‌లో జరిగింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్‌. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 

Read more: చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం ఘన సత్కారం.. నంది అవార్డులు ఇవ్వనందుకు బాధగా ఉందని వెల్లడి..

Also read: మరోసారి రాముడిగా ప్రభాస్‌.. మూడు భాగాలుగా `కల్కి`?.. నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ వేరే లెవల్‌.. షాకింగ్‌ డిటెయిల్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja వల్లే పవన్‌ సాయి తన భార్యకి విడాకులు ఇచ్చాడా? గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి
Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర