Nani - Keerthy Sruesh : ‘నిన్ను వదలను కీర్తి సురేష్’... నాని హింట్ ఇస్తున్నారా?

Published : Feb 04, 2024, 03:40 PM IST
Nani - Keerthy Sruesh : ‘నిన్ను వదలను కీర్తి సురేష్’... నాని హింట్ ఇస్తున్నారా?

సారాంశం

నాని - కీర్తి సురేష్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి  నుంచి వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అయితే తాజాగా కీర్తి సురేష్ పై నాని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 

నేచురల్ స్టార్ నాని Nani వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. విభిన్న కథలతో అలరిస్తున్నారు. మరోవైపు తన సినిమాల ద్వారా హీరోయిన్లకు కూడా తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరగా చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఆడియెన్స్ కు నాని సినిమాతో బాగా దగ్గరైన ముద్దుగుమ్మనే కీర్తి సురేష్ Keerthy Suresh. కీర్తి సురేష్ కూడా టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో రూపుదిద్దుకున్న ‘మహానటి’ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే.. నాని - కీర్తి సురేష్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నేను లోకల్’ Nenu Local. 2017లో ఈ చిత్రం విడుదలైంది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకుంది. త్రినాదరావు రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ముఖ్యంగా నాని, కీర్తి సురేష్ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, బ్యూటీఫుల్ లవ్ స్టోరీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇలాంటి సినిమాను.. వీరి కాంబినేషన్ లోనే ఫ్యాన్ కోరుకుంటున్నారు. 

అయితే ఈ చిత్రం విడుదలై ఏడు ఏళ్ల గడిచింది. 7 Years of Nenu Local సందర్భంగా నాని, కీర్తి సురేష్ ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ‘బాబు, పొట్టి.. ఏడేళ్లు తెలియకుండానే గడిచిపోయింది.. ఈ చిత్రం వచ్చి 7 సంవత్సరాలు అయినందున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.’ అంటూ పోస్ట్ పెట్టింది. అందుకు నాని ఆసక్తికరంగా రిప్లై ఇచ్చారు. ‘నువ్వు నా నుంచి తప్పించుకోలేవు కీర్తి సురేష్.. నిన్ను డిస్టబ్ చేస్తూనే ఉంటా..’ అంటూ బదులిచ్చారు. 

దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నేను లోకల్ సినిమా తర్వాత వీరి కాంబోలో ‘దసరా’ వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. నాని తాజాగా  ‘నిన్ను వదలను’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఫ్యూచర్ లో మళ్లీ ఈ పెయిర్ రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాని-కీర్తి జంటగా ఎన్ని సినిమాలు వచ్చిన ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఇష్టంగానే చూస్తుంటారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన