అంబులెన్స్ లో తారకరత్న మృతదేహం తరలింపు.. ఫ్యాన్స్ అసంతృప్తి.. అంత్యక్రియల వివరాలు..

Published : Feb 18, 2023, 11:21 PM ISTUpdated : Feb 18, 2023, 11:25 PM IST
అంబులెన్స్ లో తారకరత్న మృతదేహం తరలింపు.. ఫ్యాన్స్ అసంతృప్తి.. అంత్యక్రియల వివరాలు..

సారాంశం

తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. అంబులెన్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. అయితే తారకరత్న కన్నుమూశారనే వార్తతో స్థానికంగా ఉన్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు.

నందమూరి నటుడు, యంగ్‌ హీరో తారకరత్న 23రోజుల పోరాటం అనంతరం శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు. అత్యంత విషమ పరిస్థితి నుంచి కోలుకున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. బెస్ట్ ట్రీట్‌మెంట్‌ అందుతుందని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని బాలకృష్ణ తో సహా అంతా భావించారు. కానీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఈ రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్‌ డెడ్‌కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. అంబులెన్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. అయితే తారకరత్న కన్నుమూశారనే వార్తతో స్థానికంగా ఉన్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారిచూసేందుకు భారీగా తరలి వచ్చారు. అభిమానుల తాకిడిని గమనించిన వైద్య బృందం.. తారకరత్న భౌతిక కాయాన్ని ఆసుపత్రి బ్యాక్‌ గేట్‌ ద్వారా అంబులెన్స్ లో తరలిస్తున్నారు. రేపు(ఆదివారం)ఉదయం వరకు ఆయన మృతదేహం హైదరాబాద్‌కి చేరే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే తారకరత్నని బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తారకరత్నని చూసేందుకు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, ఆయన్ని చూడాలని తపించామని, కానీ తమకు సమాచారం ఇవ్వకుండా, చూడనివ్వకుండా బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించడం పట్ల వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకి బాడీని చూపించాలని, చూపించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే తారకరత్న భౌతికకాయానికి ఎల్లుండి(సోమవారం) సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు తారకరత్న మృతి వార్తతో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే