నాగచైతన్య - వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న చిత్రం ‘కస్టడీ’. తాజాగా యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ అంశాలతో అదిరిపోయింది. సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చైతూ తొలిసారిగా పోలీస్ పాత్రలో నటించడం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను కూడా అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా Custody థియేట్రికల్ టీజర్ కూడా విడుదల చేశారు.
ట్రైలర్ సినిమాకు సంబంధించిన అంతర్దృష్టిని తెలియజేసింది. చట్టానికి లోబడి ఉండే కానిస్టేబుల్ శివ(నాగచైతన్య) ఎన్నో హత్యలు చేసిన వ్యక్తిని జైలు నుంచి తప్పించాడని తెలుస్తోంది. అతన్ని రక్షించడం, చనిపోనివ్వకుండా ఎప్పటికప్పుడు సహకరించినట్టు కనిపిస్తోంది. కథాంశం ప్రత్యేకంగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని అర్థం అవుతోంది. మరోవైపు అతని ప్రియురాలు మరొక వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది, అతను ఒక నేరస్థుడిని కోర్టు ముందు హాజరుపరిచే వరకు తన ప్రత్యర్థుల నుండి కాపాడాల్సిన వస్తుంది.
సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. చై పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ తోనూ అదరగొట్టాడు. కృతి శెట్టి కథానాయికగా ఆకట్టుకుంటోంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు. కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మొత్తానికి వెంకట్ ప్రభు మాస్టర్ మైండ్ తో వదిలిన కస్టడీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. డైలాగ్స్ కూడా అదిరిపోయాయి.
నిర్మాత చిత్తూరి శ్రీనివాస్.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతమైనది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. మే12న చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి టీమ్ ఏవిషయంలోనూ తగ్గడం లేదు. SR కతీర్ కెమెరా పనితీరు చాలా బాగుందని తెలుస్తోంది. మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద ఎస్సెట్. వెంకట్ రాజన్ ఎడిటింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Truth will always Triumph!! Let's Begin the HUNT❤️🔥
Here's the Most Awaited 🔥
Tel: https://t.co/yuzyTu4gH6
Tam: https://t.co/EFYPBI0SKq pic.twitter.com/u3BlN2ympG