నా పక్క కూర్చొని నా గురించి తప్పుగా మాట్లాడారు.. హీరోయిన్ కామెంట్స్!

Published : Jun 15, 2019, 09:56 AM IST
నా పక్క కూర్చొని నా గురించి తప్పుగా మాట్లాడారు.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ నటి తారా సుతారియా తను ఎదుర్కొన్న వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. 

బాలీవుడ్ నటి తారా సుతారియా తను ఎదుర్కొన్న వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆమె నటిగా పరిచయమైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

పునీత్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. అనన్య పాండే మరో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లినప్పుడు తారాకి ఓ వింత అనుభవం ఎదురైంది. 

తన పక్కన కూర్చొని ఉన్న ఇద్దరు అమ్మాయిలు తన గురించి చెడుగా మాట్లాడారని తారా చెప్పారు. వారి పక్కన ఉన్నది తారా సుతారియా అనే విషయం వారికి తెలియకపోవడంతో.. సినిమాలో ఓ సన్నివేశం చూసిన తరువాత ఆమె గురించి చెడుగా మాట్లాడారట.

చివరకి సినిమా పూర్తై లైట్స్ ఆన్ చేసినప్పుడు.. తను ఆ ఇద్దరు అమ్మాయిల వైపు చూడగా.. వారు తనను చూసి షాక్ అయ్యారట. దీంతో తారా నవ్వేసి పక్కకి వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'మర్జావా' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తెలుగులో సక్సెస్ అయిన 'RX 100'హిందీ రీమేక్ లో నటించనుందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు