'దీప్‌వీర్‌' పెళ్లి ఫోటోలపై స్మృతి ఇరానీ కామెడీ!

Published : Nov 15, 2018, 01:47 PM IST
'దీప్‌వీర్‌' పెళ్లి ఫోటోలపై స్మృతి ఇరానీ కామెడీ!

సారాంశం

బాలీవుడ్ జంట దీపిక పదుకొన్, రణవీర్ సింగ్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. బుధవారం కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. 

బాలీవుడ్ జంట దీపిక పదుకొన్, రణవీర్ సింగ్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. బుధవారం కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 

అయితే ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. ఒక్క ఫోటో కూడా బయటకి వెళ్లడానికి వీలు లేకుండా ఈ జంట జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు వీరి ఫోటోలు బయటకి వస్తాయా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో దీపిక, రణవీర్ ల పెళ్లి ఫోటోలను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ ఫన్నీ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అస్థిపంజరం బలమ్మపై కూర్చొని ఎదురు చూస్తున్నట్లుగా ఓ ఫోటోని పెడుతూ.. ''దీప్‌వీర్‌ ల పెళ్లి ఫోటోల కోసం చాలా సేపటివరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది'' అంటూ కామెంట్ చేశారు.

ఆమె పోస్ట్ పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఈరోజు మరోసారి ఈ జంటకి సింధి సంప్రదాయంలో వివాహం జరగనుంది. ఈ నెల 21న బెంగుళూరులో, 28న ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.    

PREV
click me!

Recommended Stories

Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన యష్‌.. `కేజీఎఫ్‌ 2`కి తాత
మరో వ్యక్తితో కనిపించిన యాంకర్ సుమ, నాన్నకి చెబుతా అంటూ కొడుకు వార్నింగ్.. కత్తి తీసుకుని..