నొప్పించి ఉంటే క్షమించండి : తనికెళ్ల భరణి

Surya Prakash   | Asianet News
Published : Apr 16, 2021, 07:23 AM IST
నొప్పించి ఉంటే క్షమించండి : తనికెళ్ల భరణి

సారాంశం

ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు.

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతిత తెలిసిందే. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి ట్విటర్‌  ద్వారా స్పందించారు.  ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు  లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని  తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.

 ‘శభాష్‌ రా శంకరా..’ అంటూ గత కొన్ని రోజులుగా నేను ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వచ్చాను. అయితే.. ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నా’ అంటూ తనికెళ్ల భరణి వీడియో ద్వారా తెలియజేశారు.
 

PREV
click me!

Recommended Stories

Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు