ఈ శుక్రవారం ఓటీటిలో ఈ రెండు సినిమాలు

Surya Prakash   | Asianet News
Published : Apr 15, 2021, 06:43 PM IST
ఈ శుక్రవారం ఓటీటిలో ఈ రెండు సినిమాలు

సారాంశం

టీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్నాయి. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. 

థియోటర్ లో సినిమాలు చూడని వాళ్లంతా ఓటీటి వైపు దృష్టి పెడుతున్నారు. ఒరిజనల్ క్వాలిటీతో,యాడ్స్ లేకుండా సినిమాను అక్కడ చూడవచ్చు కదా అని వారి ఆలోచన. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్నాయి. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. ఇక మార్చి 27న వెండితెరపై విడుదలైన ‘తెల్ల‌వారితే గురువారం’ చిత్రం ఓటీటీలో  విడుదల కాబోతోంది. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. 

అలాగే టాలెంటెడ్ హీరో శర్వానంద్.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా.. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. కిషోర్ దర్శకత్వం అందించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ యాప్‏లో ఏప్రిల్ 16 నుంచి  ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు.  చావు కబురు చల్లగా చిత్రాలు కూడా ఏప్రిల్  23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
 
దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు విలాసవంతమైన ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లైంది.   వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న  ఓటీటీ మాధ్య‌మాలు తెలుగు ప్రేక్ష‌కుల మన్ననలు అందుకుంటున్నాయి. ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌ర‌కు.. అలాగే వెబ్ సిరీస్‌లు, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూస్ అన్నింటినీ ఓ గొడుగు కింద‌కు చేర్చి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?