మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చర్చకు సిద్ధమా?: తమ్మారెడ్డి భరద్వాజ

By Sumanth KanukulaFirst Published Jan 12, 2022, 5:14 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (nallapareddy prasanna kumar reddy)  తెలుగు  సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి (tammareddy bharadwaja) వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. ‘మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా’ అని సవాల్ విసిరారు. 

వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (nallapareddy prasanna kumar reddy)  తెలుగు  సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి (tammareddy bharadwaja) వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..  సినిమా వాళ్లు కష్టపడి డబ్బు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదన్నారు. ‘మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా’ అని సవాల్ విసిరారు. ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా అని ప్రశ్నించారు. 

సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చేది ఒక్క సినీ రంగమేనని చెప్పుకొచ్చారు. ఇక్కడ కులం చూసి ఎవరికి అవకాశాలు ఇవ్వరిన అన్నారు. సినిమా వాళ్లకు దమ్ము, ధైర్యం ఉన్నాయని... తామెవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉంటుందన్నారు.. అయితే ప్రొడక్ట్‌కు తామే ధరను నిర్ణయించే హక్కు తమకు కూడా ఉందని అన్నారు. 

సినిమా టిక్కెట్ రేట్లు మరీ తక్కువ ఉన్న సమయంలో చట్టం సాయంతో నిర్మాతలు టిక్కెట్ రేట్లను ఫెక్సిబుల్ గా, వేరియబుల్ గా పెంచుకోవచ్చని, ఆ విధమైన ప్రయత్నం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడటానికి ఏపీలోని టికెట్ రేట్లు ప్రధాన కారణం కాదని.. కరోనా వల్ల సినిమాలు వాయిదా పడ్డాయన్నారు. 

సినిమా వారికి బలిసిందని కామెంట్స్ చేయడం సబబు కాదన్నారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత? అంటూ సూటిగా ప్రశ్నించారు. తాము రూ. కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు ఏరుకుంటున్నాం.. కానీ రాజకీయ నాయకులు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దని అన్నారు. 

అఖండ, పుష్ప.. లాంటి సినిమాలు టిక్కెట్ రేట్లు తక్కువ ఉన్న కంటెంట్ బాగుండటంతో ప్రజాదరణ పొందాయని, ఈ విషయాన్ని కూడా గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను క్రమబద్ధీకరించడానికి కమిటీని వేసిందని.. తద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. టిక్కెట్ రేట్ల విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కల్పించుకోవడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారని.. కానీ అవి కరెక్ట్ కాదని చెప్పారు. ఈ విషయాలు మాట్లాడటానికి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలి అని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు.

click me!