
సినీ ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ (nallapareddy prasanna kumar reddy) రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ( nv prasad) ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లపై అమర్యాదగా మాట్లాడటం సరికాదని అన్నారు. నల్లపరెడ్డి కుటుంబం రెడ్డి మీద తమకు చాలా గౌరవం ఉందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి అని చెప్పారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాటాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని అన్నారు. బలిసి కొట్టుకుంటున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. తాము కూడా అలాంటి మాటలు మాట్లాడొచ్చని.. కానీ తమకు సంస్కారం ఉందని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ జీవితం ఏమిటో కొవ్వూరు ప్రజలను అడిగితే తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని ఎన్వీ ప్రసాద్ అన్నారు. బలిసి కొట్టుకుంటున్నది సినిమా వాళ్లు కాదని... మీరేనని అన్నారు. వంద అడుగులపై నుంచి రోప్ కట్టుకుని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ బలిసి కొట్టుకుంటుందనే మాటను వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడండని ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్వీ ప్రసాద్ సవాల్ విసిరారు. తన సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్‌ను ఆహ్వానిస్తాని ఆయన వెల్లడించారు.
ఇక, ఇటీవల ఓ కార్యాక్రమంలో మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి andhrapradesh అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. ticket rates తగ్గిస్తే సామాన్యలు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పంటేని ఆయన సమర్థించుకున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.