విష్వక్ సేన్ చేసిన పని దర్శకులందరికీ అవమానమే,ఆయన ఏకిపారేసారు

Published : Nov 09, 2022, 08:14 AM IST
 విష్వక్ సేన్ చేసిన పని దర్శకులందరికీ అవమానమే,ఆయన ఏకిపారేసారు

సారాంశం

యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విష్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు .. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ .. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే అని చెప్పుకొచ్చారు.      


విశ్వక్‌సేన్‌ (vishwak sen) వ్యవహారశైలి అన్‌ ప్రొఫెషనలిజమంటూ సీనియర్‌ నటుడు అర్జున్‌ (Arjun) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. విశ్వక్‌కు నిబద్ధత లేదంటూ అర్జున్‌ కాస్త గట్టిగానే మాట్లాడారు. తనలా మరో నిర్మాతకు జరగకుండా ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో హీరో విశ్వక్‌సేన్‌  స్పందించారు. ఆయన మాటలు వివాదమయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విష్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు .. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ .. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే అని చెప్పుకొచ్చారు.   
  
 తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... "ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలోను చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు, విష్వక్ సేన్ కొంతవరకూ చేశారు. 'నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం' అని అన్నట్టుగా విష్వక్ చెబుతున్నాడు. 

అర్జున్ కి దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది .. చాలా సూపర్  హిట్లు ఇచ్చారు.  ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విష్వక్  ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం. 

కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్ లో ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు .. చాలామంది హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విష్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు .. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ .. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే" అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?