కమల్‌ హోస్ట్ `బిగ్‌బాస్‌`పై తమిళ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

Published : Dec 19, 2020, 10:39 AM IST
కమల్‌ హోస్ట్ `బిగ్‌బాస్‌`పై తమిళ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

సారాంశం

తమిళనాడు సీఎం పళనిస్వామికి, కమల్‌ హాసన్‌కి మధ్య రాజకీయ విమర్శలు ఇప్పుడు కమల్‌ హోస్ట్ గా నిర్వహించే `బిగ్‌బాస్‌`కి తగిలాయి. తమిళనాడు సీఎం కె.పళనిస్వామి.. `బిగ్‌బాస్‌`ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయ విమర్శల సెగలు టీవీ షోలకు తగిలాయి. తమిళనాట రాజకీయ అస్త్రాలు ఓ షోని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ టీవీ యాజమాన్యం తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. తమిళనాడులో కమల్‌ హాసన్‌ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగానూ రాణిస్తున్నారు. ఆయన ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. 

ఈ క్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామికి, కమల్‌ హాసన్‌కి మధ్య రాజకీయ విమర్శలు ఇప్పుడు కమల్‌ హోస్ట్ గా నిర్వహించే `బిగ్‌బాస్‌`కి తగిలాయి. తమిళనాడు సీఎం కె.పళనిస్వామి.. `బిగ్‌బాస్‌`ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఐటీ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో లెక్కలోకి రాని డబ్బులు భారీగా సీజ్‌ చేశారు. దీనిపై కమల్‌ హాసన్‌ పార్టీ ప్రతినిధులు స్పందిస్తూ, పళనిస్వామి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుందని, అందుకు ఐటీ దాడుల్లో బయటపడ్డ మనీనే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు. 

దీనిపై సీఎం పళనిస్వామి మాట్లాడుతూ, కమల్‌ హాసన్‌ డెబ్బై ఏళ్ల వయసులో బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? బిగ్‌బాస్‌ షో చూడటం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. ఇలాంటి షోస్‌ని హోస్ట్ చేయడం వల్ల ఫ్యామిలీస్‌ ఏం బాగుపడవు` అని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు బిగ్‌బాస్‌పై కొత్త చర్చ మొదలైంది. దీన్ని నిర్వహించే యాజమాన్యం ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే