పెళ్లెప్పుడంటే కొట్టేస్తానంటోన్న సింగర్‌ సునీత.. సెకండ్‌ మ్యారేజ్‌పై సందేహాలు..

Published : Dec 19, 2020, 09:31 AM IST
పెళ్లెప్పుడంటే కొట్టేస్తానంటోన్న సింగర్‌ సునీత.. సెకండ్‌ మ్యారేజ్‌పై సందేహాలు..

సారాంశం

సింగర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకుంది సునీత. ఆమె కొద్ది రోజుల క్రితం తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. చాలా రోజులుగా ఒంటరిగానే ఉంటున్న సునీత ఎట్టకేలకు రెండో పెళ్లికి సిద్దమైంది.

పెళ్లెప్పుడంటే కొడతానంటోంది సింగర్‌ సునీత. దాని గురించి మాట్లాడవద్దని పేర్కొంది. `హుష్‌` అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఇటీవల రామ్‌ వీరపనేనితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సునీత ఇలాంటి కామెంట్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

సింగర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకుంది సునీత. ఆమె కొద్ది రోజుల క్రితం తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. చాలా రోజులుగా ఒంటరిగానే ఉంటున్న సునీత ఎట్టకేలకు రెండో పెళ్లికి సిద్దమైంది. ఇటీవల డిజిటల్‌ రంగంలో రాణిస్తున్న రామ్‌ వీరపనేనితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఈ నెల 27న ఆమె వివాహం జరుగబోతుందంటూ ప్రచారం జరిగింది. 

ఇదిలా ఉంటే ఇప్పట్లో వీరి మ్యారేజ్‌ జరిగే అవకాశం లేదట. తాజాగా ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో సునీత స్పందించారు. మీ పెళ్ళి ఎప్పుడని విలేకరి అడగ్గా, `హుష్‌.. `అంటూ వేలితో నోటిని కవర్‌ చేసింది. మరోవైపు మీరు పెళ్ళి ఇక్కడే చేసుకుంటారా? బయట చేసుకుంటారా? అని అడగ్గా నవ్వుతూ కొట్టేస్తానని సరదాగా కామెంట్‌ చేసింది.  ఈ సందర్భంగా చీరలోని అందాన్ని వర్ణించింది సునీత. తనకు చీర అంటే ఇష్టమని, అందులోనే హుందాతనం, అందం ఉందని, చీరలో మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పింది. అయితే ఇప్పట్లో మ్యారేజ్ ఉండదని, వచ్చే ఏడాది ప్లాన్‌ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో సునీత సెకండ్‌ మ్యారేజ్‌ ఎప్పుడనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా