
తాజాగా ఆయన యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా... ఈమూవీ సకెస్స్ ను యాత్రల్లో ఉండే ఎంజాయ్ చేస్తున్నాడు. సాధారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్ళారు. గత రెండు మూడేళ్ళుగా కరోనా కారణంగా ఆయన హిమాలయాలకు వెళ్లలేదు. ఈ హిమాలయాల దర్శనం ఆయన ఎన్నో సంవత్సరాలుగా సెంటిమెంట్ గా పాటిస్తూ వస్తున్నారు.
అంతే కాదు రజనీకాంత్ కు తన సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లడం అలవాటు.. జైలర్ రిలీజ్ కు కూడా ముందే హిమాలయాలకు వెళ్ళాడు తలైవా. గత కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రజినీకాంత్..జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇక హిమాలయాల దర్శనం తరువాత.. అటు నుంచి వరుసగా ఆశ్రమాలు, దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నాడు స్టార్ హీరో. ఈమధ్యే ఆయన హిమాలయాల్లో తన స్నేహితులతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
హిమాలయాల్లో ఆశ్రమాలను దర్శించి ఆశీర్వచనం తీసుకున్న సూపర్ స్టార్.. ఆతరువాత బద్రినాధుని దర్శించుకున్నారు. అక్కడ కూడా భక్తుల తాకిడితో పాటు.. రజనీకాంత్ ఫ్యాన్స్ తాకిడి కూడా ఎక్కువైపోయింది. బద్రినాధుని సన్నిదిలోని ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం
సుకున్నాడు. ధ్యానం చేసి మనశ్శాంతిని పొందడాడు ఆయన జార్ఖండ్ టూర్ వేశారు. ఆ సిటీలో ఉన్న యోగానంద ఆశ్రమాన్ని విజిట్ చేశారు. అక్కడ ఓ గంటసేపు ఆయన ధ్యానం చేశారు. ఆ సిటీ సమీపంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా రజినీ దర్శించుకున్నారు. ఉత్తరాఖండ్‌లో భద్రీనాథ్ దర్శనం తర్వాత ఆయన జార్ఖండ్ చేరుకున్నారు.రాంచీలో ఉన్న యోగదా ఆశ్రయంలోని స్వామి యోగానంద రూమ్‌లో సుమారు గంట సేపు రజనీ ధాన్యం చేశారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న సీనియర్ స్వాములతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యోగానంద ఆశ్రమానికి వచ్చినట్లు రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు.
ఆశ్రమ సందర్శనంతో పాటు... రాంచీ సమీపంలో ఉన్న భైరవి, దామోదర్ నదీ సంగమం వద్ద ఉన్న ఆలయాన్ని కూడా ఆయన దర్శించి.. ప్రత్యేక హారతి, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకముందు ఉత్తరాఖండ్ టూరలో రజనీకాంత్.. ద్వారహట్‌లో ఉన్న పాండవ్‌కోహ్లీ గుహలో ధ్యానం చేసిప్రశాంతతను పొందారు. ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. 400 కోట్లు దాటి పరుగులు పెడుతోంది జైలర్.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స సాధిస్తోంది. నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేశారు.